Nellore: నెల్లూరు జిల్లాలో నేలకేసి కొట్టినా పగలని కోడి గుడ్లు

కడప జిల్లాలో అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు కల్తీ బియ్యం పంపిణీ చేసిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో కల్తీ కోడిగుడ్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతుంది.

Nellore: నెల్లూరు జిల్లాలో నేలకేసి కొట్టినా పగలని కోడి గుడ్లు

Eggs

Plastic Eggs: కడప జిల్లాలో అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు కల్తీ బియ్యం పంపిణీ చేసిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో కల్తీ కోడిగుడ్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతుంది.

ఇటీవలికాలంలో ఏ వస్తువుని అయినా కల్తీ చెయ్యడానికి వెనకాడట్లేదు కల్తీగాళ్లు. బియ్యం, నూనె ఇలా ఎన్నో కల్తీలు చూశాం కదా? లేటెస్ట్‌గా కోడిగుడ్లు కల్తీ కూడా మార్కెట్లో కలకలం సృష్టిస్తోంది.

నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు మండలం అండ్రవారిపల్లిలో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలకలం రేపాయి. పామూరు నుంచి తెచ్చి ఆటోలో తెచ్చిన కోడిగుడ్లను విక్రయించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఒక అట్ట 100 రూపాయలకు అమ్మగా తక్కువ ధరకు వస్తున్నాయని ఎక్కువ మంది కొనుగోలు చేశారు.

అయితే, ఉడకబెట్టిన తర్వాత గుడ్లు నల్లగా మారడంతో కొన్నవారు విస్తుపోయారు. మాములుగా అయితే మార్కెట్లో ఆరు రూపాయలు చేసే గుడ్డు.. ఒక అట్ట అంటే, దాదాపు 30కోడి గుడ్లు.. 30కోడిగుడ్ల ధర 180రూపాయలు వరకు ఉంటుంది. 80రూపాయలు తగ్గించి అంటే మూడున్నర రూపాయలు కూడా అవ్వలేదు. ఎంత తగ్గించి అమ్మినా కూడా ఇంత తక్కువకు ఎలా అమ్ముతారు అని ఎవరూ ఆలోచించలేదు..

చివరకు మోసపోయినట్లు గ్రహించిన తర్వాత గుడ్లను నేలకేసి కొట్టినా అది పగలలేదు. దీంతో అవి ప్లాస్టీక్ గుడ్లుగా తెలిసిపోయింది.