బాబుకి ముందు నుయ్యి-వెనుక గొయ్యి : ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానులు ఆగదు

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 01:54 PM IST
బాబుకి ముందు నుయ్యి-వెనుక గొయ్యి : ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానులు ఆగదు

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. ఎంతమంది అడ్డుకున్నా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది విశాఖ రాజధాని కాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, అది సాధ్యం కాదని విజయసాయి రెడ్డి అన్నారు.

విశాఖలో జీవీఎంసీ పార్కులో విజయసాయి రెడ్డి మొక్కలు నాటారు. కొత్త రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. చంద్రబాబు, సుజనా చౌదరి అమరావతిలో వేల ఎకరాలు కొన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే 3 రాజధానులను ఆ ఇద్దరు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

బాబుకి.. ముందు నుయ్యి-వెనుక గొయ్యి:
శాసన మండలి రద్దుపై తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబుకు పెద్ద సంకటమే వచ్చి పడిందన్నారు. ఆయన మునుపటిలా సోనియా గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయావతి వంటి వారిని కలిసి రాజ్యసభలో మండలి రద్దు బిల్లును అడ్డుకోవాలని కోరలేరని వ్యాఖ్యానించారు. వాళ్లను కలిస్తే బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి లాగా తయారైందని ఎద్దేవా చేశారు.

 

ఇంకోసారి వాతలు తప్పవు:
”శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంటు తిరస్కరిస్తుందని కలలు కనొచ్చునని.. కాలభైరవ యాగాల తర్వాత క్షుద్రపూజలే మిగిలాయని.. అవి కూడా కానిచ్చి ఫలితం కోసం నిరీక్షించండని అన్నారు. రాజధాని భూముల కోసం టీడీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇంకోసారి వాతలు తప్పవని” విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడు అమ్మా అని అరుస్తాడు:
జనసేనాని పవన్ పైనా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ” ‘దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడి రియాక్షన్ ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజీ తీసుకున్నవాడి బాధ్యత కదా!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

* జీవీఎంసీ పార్కులో మొక్కలు నాటిన విజయసాయిరెడ్డి
* కొత్త రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
* రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
* కొంతమంది విశాఖను రాజధాని కాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు
* ఎంతమంది అడ్డుకున్నా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం

* ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదు
* కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు
* సుజనా, చంద్రబాబు అమరావతిలో వేలాది ఎకరాలు కొన్నారు
* అందుకే 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారు