Kakani Govardhan Reddy: నెల్లూరు రూరల్‌లో ఎక్కువ మెజారిటీ సాధిస్తాం: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

 సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు.

Kakani Govardhan Reddy: నెల్లూరు రూరల్‌లో ఎక్కువ మెజారిటీ సాధిస్తాం: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kakani Govardhan Reddy: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకంటే నెల్లూరు రూరల్‌లో వైసీపీ ఎక్కువ మెజారిటీ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమవారం నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణితోపాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Turkey, Syria Earthquakes : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. వేలాది భవనాలు నేల మట్టం, 3600లకు చేరిన మృతుల సంఖ్య

ఈ సందర్భంగా కోటంరెడ్డిపై విమర్శలు చేశారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ ‘‘జగన్ ఇచ్చిన బీ ఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నారు. నెల్లూరు రూరల్ లో వైసీపీ కేడర్ అంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపే నిలిచింది. ఎందరో కార్పొరేటర్లు.. బలం ఉంది.. బలగం ఉంది అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అంతా ఆదాల వైపు వచ్చారు. రూరల్‌లో వైసీపీకి పట్టిన దరిద్రం వదిలింది. ఎన్నికలకు ముందు వెళదామనుకున్నారు.. కానీ దేవుడు ముందే పంపాడు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే రూరల్‌లో ఎక్కువ మెజారిటీ సాధిస్తాం’’ అన్నారు.

Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఆదాల ప్రభాకర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఎవరు పార్టీని వీడినా జగన్‌కు ఏమీ కాదు. జిల్లాలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తుంది. జిల్లాలో నాయకులంతా ఒకతాటిపైకొచ్చి అన్ని సీట్లూ గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తాం. నెల్లూరు వైసీపీకి కంచుకోటగా మరోసారి నిలుపుకొంటాం’’ అన్నారు. నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనువాసులు రెడ్డి మాట్లాడుతూ ‘‘ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 30 ఏళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నా శ్రీధర్ రెడ్డికి ఎలాంటి పదవి రాలేదు. అలాంటి వ్యక్తికి జగన్ వైసీపీ టికెట్ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేను చేశారు. అలాంటి జగన్‌ను శ్రీధర్ రెడ్డి మోసం చేశారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది’’ అన్నారు.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘నెల్లూరు రూరల్‌లో ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరాచకాలను, బెదిరింపులను ఉక్కు పాదంతో అణచివేస్తాం. అందరికీ అందుబాటులో ఉంటా’’ అని వ్యాఖ్యానించారు.