TDP-Janasena: టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది.

TDP-Janasena: టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా?

Tdp Janasena

TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. అయితే, ఇటీవల చంద్రబాబు చేసిన వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తుందా? అనేది ఇప్పుడు ఏపీలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. చంద్రబాబు ఇన్‌డైరక్ట్‌గా పొత్తుల గురించిపై చేసిన వ్యాఖ్యలు, జనసేనాని స్పందించిన తీరు చూస్తుంటే వైసీపీనీ ఢీకొట్టేందుకు విపక్షాలు ఏం చేస్తున్నాయనేది చర్చనీయాంశమైంది.

రాజకీయల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎన్నికల వేళ పార్టీలు పొత్తులు కుదుర్చుకోవడం కామన్ అయిపోయింది‌. అప్పటివరకు ఆయా పార్టీల అధినేతలు ఒకర్నొకరు విమర్శించుకున్నా, ఆరోపించుకున్నా పొత్తు పొడిచే వేళ ఏవీ పట్టించుకోరు. వర్కవుట్‌ అయితే అధికారంలోకి రావడం దాదాపు ఖాయమే. ఓడిపోతే ఆ తర్వాత కలిసి నడిచినా, నడవకపోయినా మళ్లీ పట్టించుకోరు.

2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు తెలిపారు. జనసేన సపోర్ట్‌తో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల నాటికి టీడీపీతో జనసేన విభేదించింది. ఆ ఎన్నికల్లో ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. టీడీపీ ఓడిపోగా.. వైసీపీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మరి 2024 ఎన్నికలకు ఏయే పార్టీలు ఎలా ముందుకు వెళ్లనున్నాయి. ఇటీవల ఇదే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.

RRR: రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు