Ambati Rambabu : విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించరు..? : అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బీజేపీతో జతకట్టిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలదీస్తున్నారని విమర్శించారు.

Ambati Rambabu : విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించరు..? : అంబటి

Ambati

Ambati Rambabu comments on Pawan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. బీజేపీతో జతకట్టిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలదీస్తున్నారని విమర్శించారు. పవన్ ఏ దీక్ష చేసినా.. ఆవు కథనే వల్లేస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు దీక్షలో కూడా పవన్.. సీఎం జగన్ నే నిందించారని పేర్కొన్నారు. పవన్ రాజకీయం జగన్ ను నిందించేందుకేనా అని ప్రశ్నించారు. పవన్ సినిమాలను ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

వారసత్వాలకు పవన్ వ్యతిరేకం రాజకీయాల్లోనేనా?…సినిమాల్లో కూడానా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. జగన్ మంచి చేస్తే పవన్ పొగడలేరు..చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేరని విమర్శించారు. పవన్, లోకేష్ కనీసం కౌన్సిలర్ గా కూడా గెలవలేదన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు.

Auto Accident : నెల్లూరు జిల్లా బీరాపేరు వాగులో ఆటో పడిన ఘటన..ముగ్గురి మృతదేహాలు లభ్యం

విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన సినిమాలను ఆపితే భయపడతానని అనుకుంటున్నారని పేర్కొన్నారు.

తన ఆర్థిక మూలాలాపై దెబ్బకొడితే భయపడబోనని తేల్చి చెప్పారు. పంతానికొస్తే ఏపీలో ఉచితంగా సినిమా వేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పేర్కొన్నారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి అని పిలుపు ఇచ్చారు.