Kotamreddy Srinivasulu Reddy : నెల్లూరు టీడీపీ ఇంచార్జిపై దాడి.. కారుతో గుద్ది పరారైన యువకుడు

నెల్లూరు టీడీపీ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు ఓ యువకుడు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందే ఈ ఘటన జరిగింది.

Kotamreddy Srinivasulu Reddy : నెల్లూరు టీడీపీ ఇంచార్జిపై దాడి.. కారుతో గుద్ది పరారైన యువకుడు

Kotamreddy Srinivasulu Reddy : నెల్లూరు టీడీపీ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు ఓ యువకుడు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందే ఈ ఘటన జరిగింది. శ్రీనివాసులు రెడ్డి కుమారుడితో అతడి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖర్ రెడ్డిని శ్రీనివాసులు రెడ్డి మందలించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాజశేఖర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని పట్టుకోవడానికి శ్రీనివాసులు రెడ్డి వెంబడించాడు. దీంతో శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి రాజశేఖర్ పరారయ్యాడు. ఈ ఘటనలో శ్రీనివాసులు కాలు విరిగింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Also Read : MLA Anil Kumar : అయ్యప్ప దీక్షలో ఉంటూ ముస్లిం టోపీ పెట్టుకోవడంపై వివాదం.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఎదురుదాడి