Home » Author »bheemraj
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడకుండా కార్యకర్తలు కాంగ్రెస్ ను నిలబెడుతున్నారని కొనియాడారు.
అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు.
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోని అధికారులపై ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు చిన్న చిన్న సాకులు చూపి ఆపుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు.
గతంలోనూ ఆలయంపై డ్రోన్స్ కనిపించడంపై కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.
గడిచిన వారం రోజులుగా ఆయన తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు.
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కొత్త నిబంధన పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గారు. ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.
నిందితుడు చేతన్ మాట్లాడుతూ తాను అసలు రాంచంద్ కుమారును ఢీకొట్ట లేదని చెప్పారు. అతను ఉద్దేశపూర్వకంగానే తన కారు బానెట్ పైకెక్కి, తనను కారులోంచి దిగమని నానా హంగామా చేశాడని ఆరోపించాడు.
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు.
ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,70,878 మంది పూర్తిగా కోలుకున్నారు.
క్లీవ్ ల్యాండ్ లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిందితుడి సమాచారం అందిస్తే 80 వేల డాలర్లను పారితోషికంగా ఇస్తామని ప్రకటించారు.
వైద్య అధికారుల సూచనల మేరకు రవి ఆమెకు అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. నెలలు నిండక, తక్కువ బరువు, బ్రీతింగ్, హార్ట్ బీట్ కూడా లేకుండా మగ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది.
జంతువులకు, మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉందని తేల్చారు. ఇందులోని 1శాతం జన్యువుల్లో కణాల కార్యకలాపాలను నియంత్రించే ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించారు.
నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది.
గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
సీఎం కార్యక్రమంలో పాల్గొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ నిద్రపోయారు. అధికారి జిగర్ పటేల్ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా కెమెరాల కంటపడ్డారు.