Home » Author »Narender Thiru
2023, అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో శాంతి సందేశం ఇచ్చేందుకు అంగీకరించాలని ఫిఫాను కోరాడు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
‘డాక్సింగ్’కు పాల్పడ్డ పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను ఎలన్ మస్క్ శుక్రవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు ఈ చర్యను ఖండిం�
‘అగ్ని-5 క్షిపణి’ 7,000 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఇది అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలదు. గతంలోకంటే దీని బరువును శాస్త్రవేత్తలు తాజాగా 20 శాతం తగ్గించారు.
75 మంది విద్యార్థులతో కలిసి టూర్‌కు వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్ల వివాదం ముదురుతోంది. తాజాగా ఏర్పాటైన పీసీసీ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంపై పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట శనివారం ముగిసింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి.
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.
విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకు ఒక వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. బాధితుడిపై ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడంతో కోర్టు ఇన్నేళ్ల శిక్ష విధించింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీ20 క్రికెట్లో శుక్రవారం సంచలనం నమోదైంది. ఒక జట్టు అత్యల్ప స్కోరుకే ఆలౌటై చరిత్ర సృష్టించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో టీడీపీ వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడిని టీడీపీ తిప్పికొట్టింది.
ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క తెగ నచ్చేసింది వాళ్లకు. ఆ కుక్క కోసం చివరకు దాని యజమానినే కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. కుక్కను ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపాకార అక్వేరియం పేలిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్న అక్వాడోమ్ అక్వేరియం శుక్రవారం ఉదయం పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను మస్క్ సస్పెండ్ చేశాడు.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట పూర్తైంది. బంగ్లాదేశ్‌కు ఇండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడం విశేషం.
‘ఫిఫా వరల్డ్ కప్-2022’కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. నెల రోజులపాటు జనంతో సందడిగా మారిన ఖతార్, ఇప్పుడు వెలవెలబోతుంది. ఇంతకీ.. వేల కోట్లు ఖర్చుపెట్టిన దేశం ఈ టోర్నీ వల్ల బాగుపడిందా? లేదా?
యుక్రెయిన్‌పై రష్యా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌తోపాటు, క్రివ్యి రిహ్, ఖార్కివ్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్ వెల్లడించింది.
హిప్పో పోటమస్ ఒక రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసేందుకు ప్రయత్నించింది. ఒంటరిగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని సగానికిపైగా మింగేసింది. అయినా, చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
పోలీస్ ఈవెంట్స్ కొట్టిన తల్లి, కూతురు