Home » Author »Narender Thiru
రాయల్ బెంగాల్ టైగర్ నదిలో ఈదుకుంటూ 120 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒక దీవివైపు దూసుకొస్తుండగా స్థానికులు గుర్తించి, షాకయ్యారు. తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు చాలా సేపు శ్రమించి ఈ పులిని బంధించారు.
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. అమెరికన్ జంట హత్యకు సంబంధించి చార్లెస్ శోభరాజ్ 2003 నుంచి నేపాల్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ 3-0తో ఓటమి పాలైంది. పాక్ ఘోర ఓటమితో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
చైనాలో ఒక సింగర్ చేసిన పని నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం వచ్చేలా చేసింది. దేశమంతా కోవిడ్‌తో వణికిపోతుంటే ఇదేం పిచ్చి పని అంటూ ఆమెపై విమర్శలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా? కావాలని కోవిడ్ అంటించుకుంది.
చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. గతంలో టీడీపీ కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పింది.
ఆడవాళ్లు అంతా ఒక్క చోట చేరితే సందడిగా ఉంటుంది. అలాంటిది అందరూ కలిసి హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ వీడియోలో కొందరు మహిళలంతా ఒక్క చోట చేరి ఎలా పాటలు పాడుకుంటున్నారో చూడండి.
ప్రజలతో ఎలా ప్రవర్తించాలో రాహుల్ నేర్చుకోవాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక సభలో రాహుల్ ప్రవర్తించిన తీరు కారణంగా బీజేపీ నేతలు ఈ విమర్శలు చేస్తున్నారు.
కార్ల తయారీ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాయి. హ్యుందాయ్ సంస్థ కూడా త్వరలో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో కొత్త కారు విడుదల కానుంది.
భారత్‌లో కూడా కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందా? ఇండియాలో ఫోర్త్ వేవ్ రావొచ్చా? ఈ విషయంపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఈ అంశంపై స్పందించాడు.
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
బన్ను కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కౌంటర్ టెర్రరిజం సెంటర్‌పై దాడి చేసి, అక్కడి వారిని బంధీలుగా చేసుకున్న తాలిబన్ టెర్రరిస్టుల్ని పాక్ బలగాలు కాల్చి చంపాయి. దాదాపు 40 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.
దేశీయంగా తయారైన ‘వాగిర్’ సబ్ మెరైన్ మంగళవారం నావికా దళంలో చేరింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇది స్కార్పీన్ తరగతికి చెందిన ఐదో సబ్ మెరైన్.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
మేరీ కోమ్ తన ఫిట్నెస్ ప్లాన్ వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ ‘ఎ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి రోజూ 15 కిలోమీటర్లు పరుగెడతారు.
ఆమ్ ఆద్మీ పార్టీపై సుకేష్ చంద్రశేఖర్ మరో తాజా ఆరోపణ చేశాడు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్ట్ హౌజ్ వద్ద సుకేష్ మీడియాతో ఈ విషయం చెప్పాడు.
ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే.. జాగ్రత్త! ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే ఆస్తులే పోగొట్టుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇది నిజం. ఒక యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం.
రోజు కూలీగా పని చేస్తూ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఒక వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. రూ.14 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో బాధితుడు షాకయ్యాడు.
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.