5G spectrum auction: నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. లక్ష కోట్లకుపైగా ఆదాయంపై అంచనా

నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్‌వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్‌వర్క్స్, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.

5G spectrum auction: నేటి నుంచే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. లక్ష కోట్లకుపైగా ఆదాయంపై అంచనా

5g Spectrum Auction

5G spectrum auction: దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. భారత టెలికాం శాఖ నిర్వహించే ఈ వేలంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్‌వర్క్, గౌతమ్ అదానీకి చెందిన అదాని డాటా నెట్‌వర్క్స్, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు పాల్గొనబోతున్నాయి. 9 బ్యాండ్లకు సంబంధించిన 72,000 మెగా హెర్జ్ (72 గిగా హెర్జ్) స్పెక్ట్రమ్‌ను వేలం ‌వేస్తారు.

Shruti Haasan : ఒక్క సినిమాకంటే ఎక్కువ చేస్తా అనుకోలేదు.. 13 ఏళ్ళు అప్పుడే అయిపోయాయి..

దీని ద్వారా మొత్తం రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా. అయితే, తాజాగా జరిగే వేలం ద్వారా రూ.1లక్ష-1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని టెలికాం శాఖ అంచనా వేస్తోంది. ఈ వేలం దక్కించుకున్న సంస్థలు 20 ఏళ్లపాటు స్పెక్ట్రమ్ వాడుకోవచ్చు. మూడు వేర్వేరు కేటగిరీలో బ్యాండ్లను వేలం వేస్తారు. తక్కువ శ్రేణిలో 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెర్జ్, మధ్య శ్రేణిలో 3.3 గిగాహెర్జ్, అధిక శ్రేణిలో 26 గిగా హెర్జ్ బ్యాండ్లు వేలానికి అందుబాటులో ఉంటాయి. ఈసారి 600 మెగాహెర్జ్, 700 మెగాహెర్జ్, 3.3 గిగాహెర్జ్, 26 గిగా హెర్జ్ బ్యాండ్లను వేలం వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న 4జీ కంటే 5జీ పది రెట్లు వేగంగా పనిచేస్తుంది. వేలం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది.

iPhones: యాపిల్ హవా.. రెట్టింపైన ఐఫోన్స్ అమ్మకాలు

వేలంలో పాల్గొనే సంస్థలు, వాటి ధరలను బట్టి వేలం జరిగే రోజులు ఆధారపడి ఉంటాయి. అయితే, రెండు రోజుల్లోనే వేలం పూర్తవ్వొచ్చని అంచనా. స్పెక్ట్రమ్ కోసం నిర్ణయించిన కనీస ధరకు దగ్గరగానే వేలం పూర్తయ్యే అవకాశం ఉంది. 20 ఏళ్లపాటు వినియోగించుకునే ఈ వేలానికి సంబంధించి ముందుగానే చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లపాటు వార్షిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. వేలం పూర్తైతే త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.