Air India : హిస్టరీ రిపీట్.. 68ఏళ్ల తర్వాత టాట్ గ్రూపు చేతికి ఎయిర్ ఇండియా!

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్‌పై టాటా గెలిచింది.

Air India : హిస్టరీ రిపీట్.. 68ఏళ్ల తర్వాత టాట్ గ్రూపు చేతికి ఎయిర్ ఇండియా!

Air India

Air India returns : హిస్టరీ రిపీట్.. ప్రభుత్వ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా మరోసారి టాటా గ్రూప్ వశమైంది. డిసెంబర్ నాటికి టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్ ప్రమోటర్ పై టాటా గ్రూప్ బిడ్ గెలిచింది. 1932లో ఎయిర్ లైన్ బిజినెస్‌లోకి వచ్చిన టాటా గ్రూపు ఇప్పటికే భారతదేశంలో రెండు ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. ఇందులో ఒకటి సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉండగా.. మరొకటి ఎయిర్ ఏసియాతో జాయింట్ వెంచర్ కలిగి ఉంది. న్యూస్ ఏజెన్సీ బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. ప్యానెల్ ఇండియా కోసం టాటా గ్రూప్ ను ఎంపిక చేసింది. జెఆర్డీ టాటా అప్పట్లో టాటా ఎయిర్ లైన్స్ నెలకొల్పింది. 1946లో టాటా ఎయిర్ లైన్స్.. ఎయిర్ ఇండియాగా మారిపోయింది.
Air India : ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్

43వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు బిడ్స్ ఆహ్వానించింది. టాటా, స్పైస్ జెట్ బిడ్స్ వేయగా.. చివరికి టాటా సన్స్ బిడ్ గెల్చుకుంది. 68ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా టాటాసన్స్ వశమైంది. ఎయిర్ ఇండియాను అప్పుల భారం నుంచి బయటపడేందుకు అమ్మేసినట్టు పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం.. ఎయిర్ ఇండియా మొత్తం రూ .38,366.39 కోట్ల అప్పు ఉన్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఎయిర్ ఇండియాలో మొత్తం స్థిర ఆస్తులు దాదాపు రూ.45,863.27 కోట్లు ఉన్నాయి. అది కూడా మార్చి 2020 మార్చి నాటికి.. ఎయిర్ ఇండియా ల్యాండ్, బిల్డింగ్ లు, ఎయిర్ క్రాప్ట్ ప్లీట్ ఇంజిన్లు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా గతంలో టాటా గ్రూప్ కంపెనీగా పేరొంది. ఈ కంపెనీని 1932 లో JRD టాటా నెలకొల్పింది. స్వాతంత్ర్యం తరువాత విమానయాన రంగం జాతీయం అయింది. దాంతో ప్రభుత్వం టాటా ఎయిర్‌లైన్స్ 49 శాతం వాటాలను కొనుగోలు చేసింది. అనంతరం ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. జూలై 29, 1946న ఎయిర్ ఇండియాగా పేరు మార్చుకుంది. 1953లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు JRD టాటా నుంచి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1977 వరకు జెఆర్డీ టాటా చైర్మన్ గా కొనసాగారు. ఆ తర్వాతే ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని నామకరణం చేశారు. అలా టాటా గ్రూప్ 68 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత కంపెనీని దక్కించుకుంది. ప్రస్తుతం విస్తారా, ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్ లైన్స్ ను టాటా గ్రూప్ నడుపుతోంది.
Air India sale.. ‘డబ్బుల్లేక బీజేపీ ఆస్తులన్నీ అమ్మేస్తుంది’