Bank New Charges : జూన్ 1 నుంచి పెరిగే కొత్త ఛార్జీలివే..!

Bank New Charges : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అన్ని ఫైనాన్స్ సంస్థలు తమ సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నాయి. ఈ నెల నుంచి వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది.

Bank New Charges : జూన్ 1 నుంచి పెరిగే కొత్త ఛార్జీలివే..!

Bank New Charges New Banking Charges Will Effect From June 1, 2022 (1)

Bank New Charges : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అన్ని ఫైనాన్స్ సంస్థలు తమ సర్వీసులపై ఛార్జీలను పెంచనున్నాయి. ఈ నెల నుంచి వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంకు హోంలోన్ వ‌డ్డీరేట్ల నుంచి థ‌ర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం లోన్ల వ‌ర‌కు అన్నింటిల్లో వినియోగదారులపై భారం పడనుంది. ఏయే బ్యాంకుల్లో ఏయే ఫైనాన్స్ సంస్థల్లో ఎలాంటి ఛార్జీలు పెరగనున్నాయో ఓసారి చూద్దాం.. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR‌) 40 బేసిస్ పాయింట్లు పెంచేసింది. గృహ రుణాలపై వ‌డ్డీ రేటు 7.05 శాతానికి పెరగనుంది. రేపో లింక్డ్‌ లెండింగ్ రేటు కూడా 6.65 శాతానికి పెరిగిపోనుంది. ప్ర‌స్తుత EBLR 6.65 శాతంగా నమోదైంది. RLLR 6.25 శాతంగా ఉంది.

SBI ప్రకారం.. జూన్ 1, 2022 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. శాల‌రీ అకౌంట్ సర్వీసు రుసుముల‌తో పాటు యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఛార్జీలను పెంచ‌నుంది. సెమీ అర్బ‌న్/గ్రామీణ ప్రాంతాల‌లోని అకౌంట్‌దారులు నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్‌ రూ.15 వేల నుంచి రూ.25 వేల‌కు పెంచేశాయి బ్యాంకులు. లేదంటే ముందుగానే రూ.1 ల‌క్ష ట‌ర్మ్ డిపాజిట్ చేయాలి. క‌నీస బ్యాలెన్స్ లేని వినియోగదారులకు పెనాల్టీ ఛార్జీల‌ను 7.50 శాతం వరకు పెంచ‌నుంది.

Bank New Charges New Banking Charges Will Effect From June 1, 2022 (2)

Bank New Charges New Banking Charges Will Effect From June 1, 2022

ఈ కొత్త రూల్స్‌ జూన్ 1 నుంచి బ్యాంకు ఖాతాదారులకు వర్తించనున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్ బీమా ప్రీమియం కూడా భారీగా పెరగనుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. టూవీలర్ వాహనాల్లో ఇంజిన్‌ సామ‌ర్థ్యం 75cc కన్నా త‌క్కువ ఉంటే ఆ వాహనాలపై బీమా ప్రీమియం రూ.538గా ఉండనుంది. 75cc పైన‌ 150cc లోపు వాహనాలపై రూ.714గా ఉండనుంది.

150cc నుంచి 350cc మించ‌ని వాహనాలపై రూ.1366గా, 350cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌లకు ప్రీమియం రూ.2,804గానూ ఉండనుంది. 1000cc ఇంజిన్‌ సామర్థ్యంతో ప్రైవేటు కార్ల ప్రీమియం రూ.2094 వరకు పెరగనుంది. 1000cc పైనా 1500cc కలిగిన ఇంజిన్‌ సామర్థ్యంతో నడిచే ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం ధర రూ.3,416కు పెరగనుంది. అలాగే 1500cc కన్నా ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన కార్ల ప్రీమియం రూ.7,890 వరకు పెరగనుంది.

మరోవైపు.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీల‌ను పెంచేసింది. AePS లావాదేవీలపై ఈ ఛార్జీల‌ను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌, డిపాజిట్‌, మిని‌స్టేట్ మెంట్ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ప్రతినెలా మొద‌టి 3 వరకు ఉచితంగానే పొందవచ్చు. క్యాష్ డిపాజిట్‌, విత్‌డ్రాల‌కు రూ.20+GST, మినీ స్టేట్‌మెంట్ రూ.5+GST వ‌ర్తిస్తుంది.

Read Also :  HDFC Bank : హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్లలో కోట్ల రూపాయలు జమ..ఖాతాదారులు షాక్