50 లీటర్ల పెట్రోల్ ఉచితం.. వారికి మాత్రమే ఈ బంపరాఫర్

50 లీటర్ల పెట్రోల్ ఉచితం.. వారికి మాత్రమే ఈ బంపరాఫర్

bumper offer Free petrol, diesel: ఇంధన ధరలు భగ్గుమంటున్న వేళ వాహనదారులకు శుభవార్త వినిపించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. తమ కస్టమర్లకు ఉచితంగానే పెట్రోల్ లేదా డీజిల్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 50 లీటర్ల ఇంధనాన్ని (పెట్రోల్ లేదా డీజిల్) ఫ్రీగా పొందొచ్చు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డుపై ప్రత్యేక ఆఫర్‌ను విడుదల చేసింది. దీంతో 50 లీటర్ల ఉచిత ఇంధనాన్ని పొందొచ్చు. ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్లలో ఇంధనం కొట్టించాక, HDFC IOCL క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు పే చేస్తే ఇంధన పాయింట్లు(ఫ్యూయల్ పాయింట్స్- 1 FP=96పైసలు) లభిస్తాయి. వాటిని రీడీమ్ చేస్తే ఏడాదికి 50లీటర్ల ఇంధనం ఫ్రీ.

కార్డు హోల్డర్లు ఐఓసిఎల్ కార్డుతో ఖర్చు చేసిన మొత్తం డబ్బులో 5శాతం ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. తొలి ఆరు నెలలు.. నెలకు గరిష్టంగా 250 ఫ్యూయల్ పాయింట్లు పొందొచ్చు. తర్వాత 150 ఫ్యూయల్ పాయింట్లు వస్తాయి. గ్రాసరీ(నిత్యవసరాలు), బిల్ పేమెంట్స్‌పై నెలకు 100 ఫ్యూయల్ పాయింట్లు లభిస్తాయి. ఇతరత్రా వాటిపై రూ.150 ఖర్చు చేస్తే 1 ఫ్యూయల్ పాయింట్ వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అంతే కాదు, 1 శాతం ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. ఫ్యూయెల్ పాయింట్లు రెండేళ్ల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. ఇలా ఏడాదికి 5వేల ఫ్యూయల్ పాయింట్లు చేస్తే చాలు. ఈ పాయింట్ల సాయంతో కార్డుదారులు ప్రతి ఏటా 50 లీటర్ల ఉచిత ఇంధనాన్ని పొందొచ్చు.

నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేసుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఇందుకోసం రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కార్డు వార్షిక ఫీజు రూ.500. ఏడాదికి రూ.50వేలు ఖర్చు చేస్తే ఈ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా కార్డు పొందవచ్చు.

క్రెడిట్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేయాలి:
HDFC IOCL క్రెడిట్ కార్డు పొందడానికి, బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్ కోసం, సమీప శాఖను సందర్శించవచ్చు. దేశంలోని వివిధ నగరాల్లోని ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ ఔట్ లెట్స్ నుండి కూడా ఈ కార్డు పొందొచ్చు.