Google CEO Sundar Pichai : చెన్నైలో గూగుల్ సీఈఓ ఇంటిని కొనేసిన తమిళ నటుడు.. ఆస్తి అప్పగిస్తూ సుందర్ పిచాయ్ తండ్రి భావోద్వేగం..!

Google CEO Sundar Pichai : చెన్నైలోని అశోక్ నగర్‌లో మన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని అమ్మేశారు. చిన్నప్పుడు పిచాయ్ ఇక్కడే పుట్టి పెరిగారట.. ఇప్పుడు ఈ ఇంటిని పిచాయ్ తండ్రి తమిళ నటుడికి అమ్మేశారు.

Google CEO Sundar Pichai : చెన్నైలో గూగుల్ సీఈఓ ఇంటిని కొనేసిన తమిళ నటుడు.. ఆస్తి అప్పగిస్తూ సుందర్ పిచాయ్ తండ్రి భావోద్వేగం..!

Google CEO Sundar Pichai’s Chennai home sold, father broke down while handing over property ( Image Source : Google Images)

Google CEO Sundar Pichai Chennai home sold : మన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వస్థలం ఎక్కడంటే? ఎవరైనా టక్కున చెన్నై అనేస్తారు.. చెన్నైలోని అశోక్ నగర్‌లో పిచాయ్ పూర్వీకుల ఇల్లు ఉంది. సుందర్ పిచాయ్ ఇక్కడే పుట్టి పెరిగారు. అయితే, ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేశారు.. తమిళ సినీ నటుడు, నిర్మాత అయిన సి మణికందన్‌ (C Manikandan) పిచాయ్ ఇంటిని కొనుగోలు చేశారు. చెన్నైలోని ఈ ఇల్లు పిచాయ్‌కి చెందినదని మణికందన్ తెలుసుకోగానే ఎలాగైనా ఈ ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారట.. సమయాన్ని కొంచెం కూడా వృథా చేయకుండా పిచాయ్ ఇంటిని సొంతం చేసుకునే పనిలో పడ్డారట.. అనుకున్నట్టుగా పిచాయ్ తండ్రిని ఒప్పించి మరి ఆ ఇంటిని కొనేశారట.. ఓ నివేదిక ప్రకారం.. ఈ డీల్ ఖరారు చేసే ప్రక్రియ సుమారు 4 నెలల సమయం పట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆస్తి అప్పగింత సమయంలో పిచాయ్ తండ్రి ఆర్ఎస్ పిచాయ్ (RS Pichai) భావోద్వేగానికి లోనయ్యారట..

అందుకే పిచాయ్ ఇంటిని కొన్నాను :
తమిళ నటుడు మణికందన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కావడంతో.. తన ప్రఖ్యాత బ్రాండ్ అయిన చెల్లప్పాస్ బిల్డర్స్ కింద సుమారు 300 గృహాలను నిర్మించాడు. ఇప్పుడా ఇళ్లను డెలివరీ చేసి ట్రాక్ రికార్డ్‌ను నెలకొల్పాడు. అయినప్పటికీ, సుందర్ పిచాయ్ ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాడు. కేవలం పిచాయ్ ఇళ్లు అని ఆయన కొనాలని అనుకోలేదట.. పిచాయ్ తల్లిదండ్రులు తనపట్ల చూపించిన వినయ విదేయత మణికందన్‌ను లోతుగా హత్తుకుంది. అందుకే ఎలాగైనా పిచాయ్ ఇంటిని సొంతం చేసుకోవాలని భావించారట.. గూగుల్ సీఈఓ తండ్రి ఆర్ఎస్ పిచాయ్ అప్పుడు అమెరికాలో ఉంటున్నందున మణికందన్ నాలుగు నెలల పాటు ఓపికగా ఎదురుచూశారని నివేదిక పేర్కొంది. ఎంతగానో వేచి ఉన్నప్పటికీ, మణికందన్ ఉత్సాహం, సంకల్పం ఎంతమాత్రం తగ్గలేదు.

Google CEO Sundar Pichai’s Chennai home sold, father broke down while handing over property

Google CEO Sundar Pichai’s Chennai home sold, father broke down while handing over property ( Image Source : Google Images)

Read Also : Honda Elevate SUV Car : కొత్త కారు కొంటున్నారా? హోండా ఎలివేట్ SUV బుకింగ్స్ ఓపెన్.. ఈ కారు ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే బుకింగ్ చేస్తారు..!

గూగుల్ సీఈఓ పేరును తండ్రి ఎక్కడా వాడలేదట.. :
ఇంటిని కొనుగోలు విషయంలో పిచాయ్ ఇంటికి వెళ్లిన మణికందన్‌కు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఇచ్చారట.. అంతేకాదు.. పిచాయ్ తండ్రి కలిసిన మొదటిసారే తనకు ఆస్తి పత్రాలను అందించారని నిర్మాత మణికందన్ చెప్పినట్టు నివేదిక తెలిపింది. పిచాయ్ ఫ్యామిలీ వినయం, వినయపూర్వకమైన విధానం చూసి తాను ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. ఇంటి రిజిస్ట్రేషన్ లేదా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గూగుల్ సీఈఓ పేరును ఎక్కడ ఉపయోగించకూడదని పిచాయ్ తండ్రి నిశ్చయించుకున్నారని మణికందన్ పేర్కొన్నాడు. వాస్తవానికి, పిచాయ్ తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉన్నాడు. తనకు ఇంటి పత్రాలను అందజేయడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించాడని మణికందన్ చెప్పాడు.

20 ఏళ్ల వయస్సు వరకు పిచాయ్ ఈ ఇంట్లోనే ఉన్నాడట.. :
ప్రస్తుత గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, IIT ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్‌ను అభ్యసించడానికి 1989లో చెన్నైని విడిచిపెట్టారు. అంతకంటే ముందు పిచాయ్ తన జీవితాన్ని చెన్నైలోనే గడిపారు. ఇంటి పొరుగువారి ప్రకారం.. పిచాయ్ తన 20 ఏళ్ల వయస్సు వరకు ఈ ఇంట్లోనే ఉన్నాడట.. డిసెంబరులో చెన్నై పర్యటనలో గూగుల్ సీఈఓ సెక్యూరిటీ గార్డులకు ఇంటి నుంచి డబ్బు, కొన్ని గృహోపకరణాలను కూడా పంపించేవారట.. ఇరుగుపొరుగు వాళ్లు కూడా పిచాయ్, ఆయన కుటుంబ సభ్యులతో బాల్కనీలో సెల్ఫీలు దిగిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Google CEO Sundar Pichai’s Chennai home sold, father broke down while handing over property

Google CEO Sundar Pichai’s Chennai home sold, father broke down while handing over property ( Image Source : Google Images)

ఆస్తి పత్రాలు అప్పగిస్తూ పిచాయ్ తండ్రి భావోద్వేగం :
పిచాయ్ పూర్వీకుల ఆస్తిని మణికందన్‌కు అప్పగించే సమయంలో మొత్తం ఇంటిని పిచాయ్ తండ్రి ధ్వంసం చేశారని, ఆ ఖర్చులు కూడా తానే భరించి, ప్లాట్‌ను అభివృద్ధి కోసం అప్పగించారని ఆయన పేర్కొన్నారు. సుందర్ తండ్రి ఆస్తి పత్రాలను అందజేసినప్పుడు.. తన మొదటి ఆస్తి కావడంతో ఆయన కొన్ని నిమిషాల పాటు భావోద్వేగానికి గురయ్యాడని మణికందన్ తెలిపారు. ఇప్పుడు మణికందన్, పిచాయ్ ఇంటి ఖాళీ స్థలంలో ఒక విల్లాను నిర్మించాలని అనుకుంటున్నాడట.. వచ్చే ఏడాదిన్నరలోగా ఈ విల్లాను పూర్తి చేయాలని మణికందన్ నిర్ణయించున్నానని చెప్పుకొచ్చాడు.

Read Also : Smartphones Bad For Kids : తల్లిదండ్రుల్లారా ఇకనైనా మేల్కోండి.. మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వొద్దు.. పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు..!