MG Comet EV Launch : ఏప్రిల్ 26న MG కామెట్ EV కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..!
MG Comet EV Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 26న (MG Comet Car) నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఫీచర్లతో పాటు ఈవీ కారు ధర వివరాలు వెల్లడయ్యాయి.

MG Comet EV launch in India on April 26, get price details here
MG Comet EV Launch : కొత్త కారు కొంటున్నారా? అయితే ఆగండి.. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ (MG Comet) నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. అధికారికంగా ఏప్రిల్ 26న భారత మార్కెట్లో MG కామెట్ EV లాంచ్ కానుంది. ఈ కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ, కొలతలు పరంగా చూస్తే కారు చాలా చిన్నది.
భారత మార్కెట్లో MG కామెట్ EV ధర రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. SAIC-GM-వులింగ్ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా.. MG కామెట్ EV కారు.. Tata Tiago.ev, Citroen e-C3 వంటి కార్లకు పోటీగా వస్తోంది. MG కామెట్ EV మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్‌ల గురించి వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది.
మూడు-డోర్ల ఎలక్ట్రిక్ కారు 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తోంది. 42PS/110Nm ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. 3.3kW ఛార్జర్‌తో బ్యాటరీ ఛార్జింగ్ సమయం 0-100శాతంకి 7 గంటలు వరకు వస్తుంది. 10-80శాతంకి 5 గంటలుగా అంచనా. MG కామెట్ EV శ్రేణి ఒకసారి ఫుల్ ఛార్జింగ్‌తో 230 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. MG కామెట్ EV కారు టాటా నానో మాదిరిగానే చిన్నదిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2,974mm పొడవు, 1,631mm ఎత్తు, 1,505mm వెడల్పు, 2,010mm వీల్‌బేస్ కలిగి ఉంది.

MG Comet EV launch in India on April 26, get price details here
ఈ MG కామెట్ EVలో ప్రత్యేకంగా రూపొందించిన LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 12-అంగుళాల వీల్స్ ఉన్నాయి. క్యాబిన్ డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు సులభంగా కూర్చొవచ్చు. 10.25-అంగుళాల ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple iPod-ప్రేరేపిత ట్విన్-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి బెల్స్, విజిల్ ఫీచర్లు ఈవీ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.