Viral Video: పట్టిన పట్టు వదలకుండా చైన్ స్నాచర్‌ను పట్టుకున్న పోలీసు

ఓ చైన్ స్నాచర్ బైకుపై పారిపోతున్నాడు. అతడిని గుర్తించి వెంబడించిన పోలీస్ కానిస్టేబుల్ చివరకు ఓ చోట దొంగను గట్టిగా పట్టేసుకున్నాడు. పోలీసును వదిలించుకుని పారిపోవడానికి దొంగ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైన్ స్నాచర్ బైక్ పై పారిపోతుండగా, అతడికి ఎదురుగా కానిస్టేబుల్ మరో బైకుపై వచ్చారు. ఇద్దరు బైకులు కింద పడిపోయాయి. అనంతరం దొంగ పారిపోబోతుండగా అతడి కాలిని కానిస్టేబుల్ గట్టిగా పట్టేసుకున్నాడు. ఎంతకీ వదలలేదు.

Viral Video: పట్టిన పట్టు వదలకుండా చైన్ స్నాచర్‌ను పట్టుకున్న పోలీసు

Viral Video: ఓ చైన్ స్నాచర్ బైకుపై పారిపోతున్నాడు. అతడిని గుర్తించి వెంబడించిన పోలీస్ కానిస్టేబుల్ చివరకు ఓ చోట దొంగను గట్టిగా పట్టేసుకున్నాడు. పోలీసును వదిలించుకుని పారిపోవడానికి దొంగ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైన్ స్నాచర్ బైక్ పై పారిపోతుండగా, అతడికి ఎదురుగా కానిస్టేబుల్ మరో బైకుపై వచ్చారు. ఇద్దరు బైకులు కింద పడిపోయాయి. అనంతరం దొంగ పారిపోబోతుండగా అతడి కాలిని కానిస్టేబుల్ గట్టిగా పట్టేసుకున్నాడు. ఎంతకీ వదలలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ దొంగను పోలీస్ కానిస్టేబుల్ పట్టుకోవడంతో పెండింగ్ లో ఉన్న 11 కీలక కేసులు కూడా పరిష్కారం అవుతుండడం గమనార్హం. ఈ ఘటన ఢిల్లీలోని షాహాబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. మరో మహిళ గొలుసును చోరీ చేయడానికి ప్రణాళిక వేసుకుని ఆ దొంగ బైకుపై వెళ్తుండగా అతడిని కానిస్టేబుల్ పట్టుకున్నట్లు తెలుస్తోంది.

‘‘ప్రాణాలకు తెగించి చైన్ స్నాచర్ ను కానిస్టేబుల్ సత్యేంద్ర అరెస్టు చేశారు. ఆ చైన్ స్నాచర్ ను అరెస్టు చేయడంతో 11 కేసులు పరిష్కారమయ్యాయి’’ అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 19 నిమిషాల పాటు ఉన్న అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..