Babies Manipulated : ఒకరి శిశువు మరొకరికి.. మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం

మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

Babies Manipulated : ఒకరి శిశువు మరొకరికి.. మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం

baby

Babies Manipulated : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చెన్నూరు మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన మమతా అనే గర్భిణీ ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. దీంతో విధుల్లో ఉన్న వైద్యులు శస్త్ర చికిత్స చేసి మమతకు పురుడు పోశారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పావని అనే గర్భిణీకి కాన్పు చేశారు.
దీంతో ఒకరికి ఆడ, మరొకరికి మగ శిశువు జన్మించారు. ఆడ శిశువును ఇవ్వాల్సిన బాధిత బంధువులకు మగ శిశువును ఇవ్వడంతో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే తేరుకున్న సిబ్బంది ఒకరికి ఇవ్వాల్సిన శిశువును మరొకరికి ఇచ్చామని చెప్పినప్పటికీ బాలింతల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే డీఎన్ ఏ టెస్టుకైనా సిద్ధమని చెబుతున్నారు.

Kurnool : కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో శిశువులు తారుమారు

బాలింతల కుటుంబ సభ్యులకు చెప్పినా వినిపించుకోవడం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్
హరిచంద్రారెడ్డి తెలిపారు. అయితే ఎవరికి ఆడ, ఎవరికి మగ శిశువులు అనేది తేలే వరకు ఇద్దరు శిశువులను శిశు సంక్షేమ శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. ఇక బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే డీఎన్ ఏ టెస్టుకు కూడా పంపిస్తామని చెప్పారు. ఫలితాలు రావడానికి రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.