7Arts Sarayu : వీడియో వివాదం.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేమ్, 7ఆర్ట్స్ సరయు

బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్, 7ఆర్ట్స్ సరయును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా..

7Arts Sarayu : వీడియో వివాదం.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేమ్, 7ఆర్ట్స్ సరయు

7arts Sarayu

7Arts Sarayu : బిగ్ బాస్-5 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్, 7ఆర్ట్స్ సరయును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా సరయు ఓ వీడియోలో నటించారంటూ ఆమెపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

యూట్యూబూర్‌ 7ఆర్ట్స్‌ సరయు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బోల్డ్‌నెస్‌ పేరుతో పచ్చిబూతులు మాట్లాడుతూ నెట్టింట రచ్చ చేసే సరయు.. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా, ఈ బోల్డ్‌ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. గతేడాది హోటల్‌ ప్రమోషన్‌ కోసం తీసిన వీడియోలో హిందువుల విశ్వాసాలను కించపరిచేలా అభ్యంతరకర విజువల్స్‌ ఉన్నాయని సరయుపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే…

సిరిసిల్ల పట్టణంలోని 7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు, ఆమె స్నేహితులు కలిసి ఒక వీడియో తీశారు. తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఆ వీడియోని రిలీజ్‌ చేశారు. ఈ వీడియోలో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మద్యం సేవించినట్లు దృశ్యాలు ఉన్నాయి.

ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్‌ సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలిం నగర్ లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి కేసుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?

బిగ్ బాస్ తర్వాత సరయు హోటల్ వ్యాపారంలోకి దిగింది. తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. ఈ వీడియో కారణంగా సరయు చిక్కుల్లో పడింది.