ఆ అనుమానంతో ప్రియురాలి నోట్లో విషం పోశాడు

అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 06:48 AM IST
ఆ అనుమానంతో ప్రియురాలి నోట్లో విషం పోశాడు

అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే

అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే చంపేశాడు. కోయంబత్తురూలో ఈ ఘటన జరిగింది. మొదట పెళ్లికి ఒప్పుకున్న యువతి.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వస్తోందని.. ప్రేమించిన వాడే ఆమెను కడతేర్చాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి పెళ్లి వాయిదా వేయడంతో.. ఆమె వేరోవరినో ప్రేమిస్తుందనే అనుమానం ఆ యువకుడికి వచ్చింది. ఆ అనుమానమే ఈ దారుణానికి కారణమైంది.

కోయంబత్తూరుకు చెందిన నందిని(20) డిగ్రీ చదువుతోంది. కాలేజీ పక్కనే దినేష్(21) అనే యువకుడు ఫ్యాన్సీ షాపు నడుపుతున్నాడు. నందినిని చూసి మనసుపడ్డ దినేష్.. ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. కొంతకాలం తర్వాత నందిని తల్లిదండ్రుల్ని కలిసి పెళ్లికి ఒప్పించాడు. నందిని చదువు పూర్తి కాగానే వివాహం చేయాలనుకున్నారు. అయితే దినేష్ అంటే ఇష్టంలేని నందిని ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. నందిని పెళ్లి వాయిదా వేయడానికి కారణం.. ఆమె మరెవరినో ప్రేమిస్తుందనే అనుమానం దినేష్‌కు వచ్చింది. దీనిపై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

నందినిపై కక్ష పెంచుకున్న దినేష్.. నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి చొరబడ్డాడు. బలవంతంగా ఆమె నోట్లో విషం పోశాడు. ఆ విషాన్ని నందిని బయటకు కక్కకుండా ఆమె నోటిని చున్నీతో కట్టేశాడు. దాంతో నందిని చనిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు నందిని అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే నందినిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నందిని మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. 

నందిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి విషం తాగాడు. గమనించిన బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించారు. దినేష్ ను కఠినంగా శిక్షించాలని నందిని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

See Also | లోక్‌పాల్ రిజెక్ట్ చేస్తే..వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు