Cyber Crimes : ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులకు హెచ్చరిక..!

కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ నిత్యం పిల్లల చేతుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయి.

Cyber Crimes : ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులకు హెచ్చరిక..!

Cyber Crimes

Cyber Crimes : మారుతున్న కాలంతో పాటు మోసాలు, నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన టెక్నాలజీతో పాటు మోసాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజర్స్ లో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు సైతం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ నిత్యం పిల్లల చేతుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయి. చేతిలో ఫోన్ ఉంది కదా అని తెలిసో తెలియకో ఏది పడితే అది నొక్కితే సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కినట్టే. ఇప్పుడు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండటంతో మళ్లీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చేతిలోనే
ఫోనో, ట్యాబో ఉంది కదా అని నోటిఫికేషన్ క్లిక్ చేస్తూ చీటర్స్ కి చిక్కిపోతున్నారు.

Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించ వచ్చా?…

ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే పిల్లల పేరెంట్స్ ని అప్రమత్తం చేస్తూ పోలీసులు ఓ వీడియో రూపొందించారు. ఆన్ లైన్ క్లాసులు అనగానే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్లను.. ఎలాంటి నిఘా లేకుండా అప్పగించకూడదని పోలీసులు సూచించారు.
ముఖ్యంగా సెల్ ఫోన్లు ఇచ్చినప్పుడు అందులో ఫైనాన్షియల్ డిటైల్స్ ఉంటాయి. ఫోన్ కి ఏ లింకు వచ్చినా పిల్లలు ఓపెన్ చేస్తే.. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పోలీసులు అన్నారు.

NeoCoV Alert : ప్రపంచాన్ని కలవరపెట్టే ఈ కొత్త NeoCoV వైరస్‌పై ఆందోళనే వద్దు.. ఎందుకంటే? ఈ ఒరిజినల్ స్టడీ చదవాల్సిందే..!

ఆన్ లైన్ క్లాసులతో పాటు గేమ్స్ ఆడేందుకు విద్యార్థులు అలవాటుపడ్డారు. గతంలో పబ్జీ ఉండేది. దాన్ని నిషేధించిన తర్వాత మరికొన్ని చైనా గేమ్స్ వచ్చాయి. సింగపూర్ కేంద్రంగా వాటి కార్యకలాపాలు సాగుతున్నాయి. గేమ్ లో లెవెల్ పెరుగుతున్నకొద్దీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. గేమ్ మూడ్ లో ఉన్న పిల్లలు వాటిని క్లిక్ చేయడంతో ఫోన్ కి అనుసంధానంగా ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి విడతల వారీగా డబ్బులు పోతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న పిల్లలు జాగ్రత్తగా లేకపోతే సైబర్ మాయగాళ్ల ఉచ్చులో పడటం ఖాయం అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. విద్యార్థులపై కచ్చితంగా తల్లిదండ్రుల నిఘా ఉండాలంటున్నారు.