Data Theft Case : డేటా చోరీ కేసు.. ఆధారాలతో విచారణకు హాజరవ్వాలని కంపెనీలకు నోటీసులు

కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.

Data Theft Case : డేటా చోరీ కేసు.. ఆధారాలతో విచారణకు హాజరవ్వాలని కంపెనీలకు నోటీసులు

Data Theft Case (1)

Data Theft Case : డేటా చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలన రేపిన విషయం తెలిసిందే. 66 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. డేటా చోరీ కేసులో కంపెనీలకు 160 సీఆర్ పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆధారాలతో సహా విచారణకు హాజరు కావాలని సోమవారం 91సీఆర్ పీసీ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 5,6,7వ తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. 40 ప్రశ్నలతో కూడిన ఒక ప్రొఫార్మాను పోలీసులు తయారు చేశారు.

కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కు డీసీపీ కలమేశ్వర్ నాయకత్వం వహిస్తున్నారు.  డేటా చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.1200కు 10 వేల మంది డేటాను అమ్మేశారు. రూ.1500కు 30 వేల మంది డేటా, రూ.2000కు 50 వేల మంది డేటా, రూ.3000కు లక్ష మంది డేటాను ముఠా విక్రయించినట్లు తెలిసింది. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ భరద్వాజ్ ను సైబరాబాద్ పోలీసులు హర్యానలో అరెస్టు చేశారు.

Massive Data Theft : బాబోయ్..66కోట్ల మంది భారతీయుల డేటా చోరీ

అతడి నుంచి 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 2 సెల్ ఫోన్స్, 2 ల్యాప్ టాప్ లు సీజ్ చేశారు. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన వారి డేటాను విక్రయించినట్లుగా గుర్తించారు. 56 లక్షల మంది హైదరాబాదీల డేటా చోరి జరిగినట్లు కనుగొన్నారు. ఏపీ నుంచి 2 కోట్ల 10 లక్షల మంది వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్లు గుర్తించారు. 66 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని నిందితుడు చోరీ చేశాడని తెలిపారు.  24 రాష్ట్రాల్లోని 8 మెట్రో పాలిటిన్ సిటీల్లో డేటా చోరీ చేశాడని పేర్కొన్నారు.

డేటా చోరీ కోసం 6 మెట్రో పాలిటిన్ సిటీల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు. డీ-మార్ట్, నీట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్ కంటాక్స్, డిఫెన్స్ కు సంబంధించిన అధికారుల డేటాను నిందితుడు చోరీ చేసినట్లు వివరించారు. జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్ స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్ సహా మరిన్ని వెట్ సైట్ల డేటా చోరీ చేసి విక్రయించారని పేర్కొన్నారు.

Massive Data Theft : షాకింగ్.. ఏపీలో 2కోట్ల మంది, హైదరాబాద్‌లో 56లక్షల మంది డేటా చోరీ

బై జ్యూస్, వేదాంత సంస్థల డేటా లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 9,10,11,12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులతో పాటు 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటాను విక్రయించినట్లు నిర్ధారణ చేశారు. డేటా చోరీ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.