Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణ.. ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఆరా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ విచారణ ముగిసింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణ.. ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఆరా

Gorantla Buchibabu

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బుధవారం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. బుచ్చిబాబు ఈడీ విచారణ ముగిసింది. ఆయనతోపాటు న్యాయవాది సోమ భరత్ కూడా వచ్చారు. కవిత్ మొబైల్స్ డాటా, బ్యాంక్ లావా దేవీలు, వ్యాపార లావా దేవీలను ఈడీ పరిశీలిస్తోంది. కవిత్ ఫోన్లను పరిశీలిస్తున్న సమయంలోనే బుచ్చిబాబును కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

లిక్కర్ పాలసీ ఆమోదం పొందకముందే బుచ్చిబాబు ఫోన్ లో డ్రాఫ్ట్ పాలసీ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించిన వివరాలను ఈడీ బుచ్చిబాబును అడిగి ఆరా తీస్తోంది. మరో 2, 3 రోజుల్లో కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సౌత్ గ్రూప్ కోసం కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఢిల్లీలో పని చేశారు. ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆమె నుంచి సేకరించిన బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు సహా 11 ఫోన్లలో ఉన్న డాటాకు సంబంధించిన విషయాలపై ఈడీ నివేదిక సిద్ధం చేస్తోంది.

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

కవిత ప్రతినిధిగా ఆమె తరపు న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. ఆయన హాజరైన కాసేపటికే కవిత్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ కార్యాలయానికి వచ్చారు. గోరంట్ల బుచ్చిబాబు ఈడీ విచారణ ముగిసింది. కాగా, సోమ భరత్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. కవితకు సంబంధించిన మొబైల్ ఫోన్లలో డాటా ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సమక్షంలో గానీ, వారి తరపు ప్రతినిధుల సమక్షంలో గానీ, వాటిని తెరవాల్సివుంటుంది. అందులో భాగంగానే బుచ్చిబాబును మంగళవారం ఈడీ విచారణకు పిలిచారు. బుధవారం కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.

ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆమె వ్యాపార లావీదేవీలు, ఆర్థిక లావా దేవీలకు సంబంధించిన స్టేట్ మెంట్స్ లో ఉన్న వివరాలు, అలాగే మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా వీటన్నింటీ ఆధారంగా ఈడీ మళ్లీ ఆమెను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. గోరంట్ల బుచ్చిబాబు కవిత ఆడిటర్ గా పని చేశారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో ఆ పాలసీ ఆమోదం పొందకముందే జీవోఎం ఆమోదించకముందే లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై ఫోన్లలో ఈడీ అధికారులు గుర్తించారు.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

అదే అంశాన్ని చార్జీషీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు కవిత ఫోన్లలోని డేటా సేకరించే సమయంలో కూడా బుచ్చిబాబును పిలవడం వెనుక బుచ్చిబాబు కవితకు ఏమైనా ఈ డ్రాఫ్ట్ పాలసీకి సంబంధించిన నివేదికను ఏమైన ఆమెకు పంపించారా? 36 పేజీల నివేదికను కవితకు పంపించారా? ఢిల్లీలో కవిత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్ గా, ఆడిటర్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సేవలన్నీ కూడా ప్రొఫెషన్ పరంగానే సేవలు అందించాను గానీ, ఎక్కడ కూడా నగదు లావాదేవీలు, అంతిమ లబ్ధిదారుడిని తాను కాదని స్టేట్ మెంట్ ఇచ్చారు.

అనేక మంది లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో కూడా కవిత కలిశారు. విజయ్ నాయర్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేందర్ తో సంబంధాలున్నాయన్న స్టేట్ మెంట్లను కూడా గతంలో బుచ్చిబాబు ఇవ్వడం గమనార్హం. వీటి అన్నింటికి సంబంధించిన అంశాలపై బుచ్చిబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.