Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసారు ఈడీ అధికారులు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ మల్హోత్రా అరెస్ట్

Delhi Liquor Scam

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు సీబీఐ ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది. ఈక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో వ్యక్తిని బుధవారం (ఫిబ్రవరి 8,2023)అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన బ్రిండ్‌కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసారు ఈడీ అధికారులు. గౌతమ్ మల్హోత్రా శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు. మల్హోత్రా అరెస్ట్ తో గత రెండు రోజుల్లో ఇది రెండో అరెస్ట్. మల్హోత్రాను ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం..విచారణల పర్వం కొనసాగుతున్న క్రమంలో ఈడీ గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేయటంతో మరింత సమాచారం అందనుంది. మల్హోత్రా లిక్కర్ విధానంలో కీలక పాత్ర వహించారనే ఆరోపణలున్నాయి. ఈరోజు మధ్యాహ్నాం మల్హోత్రాను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.

కాగా ..శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా.. పలువురు మద్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కామ్‌ కేసులో ఇది తొమ్మిదో అరెస్ట్ కావటం రెండు రోజుల్లో రెండో అరెస్ట్ కావటం ఈడీ, సీబీఐ దూకుడుకు అద్దంపడుతోంది. ఇప్పటి వరకు సీబీఐ సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా, బినోయ్ బాబు, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు.. గతంలో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు..

ఈక్రమంలో గౌతమ్ మల్హోత్రా అరెస్ట్ తో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది. ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆడిటర్‌గా భావిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ని మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మద్యం కంపెనీలకు,వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన చేసినందుకు గాను 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు విజయ్ నాయర్ ద్వారా ఇచ్చినట్లు నిందితులపై ఆరోపణలున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో లిక్కర్ పాలసీ ముడుపులను ఖర్చు చేసినట్లు ఇటీవల సప్లిమెంటరీ చార్జ్ షీట్ లో పేర్కొంది ఈడీ.