Live In Relation Partner : తల్లితో సహజీవనం.. కూతురిపై కన్నేసిన ప్రియుడు…..!

వాళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఒకరోజు తన పార్టనర్ ను ఆమె పెట్రోల్ పోసి తగల బెట్టింది. కేసు  నమోదు చేసుకున్న  పోలీసులు కొద్ది రోజులు ఆలస్యంగా  నిందితురాలిని అరెస్ట్ చేశారు

Live In Relation Partner : తల్లితో సహజీవనం.. కూతురిపై కన్నేసిన ప్రియుడు…..!

Live In Relation Murder

Live In Relation Partner : వాళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ఒకరోజు తన పార్టనర్ ను ఆమె పెట్రోల్ పోసి తగల బెట్టింది. కేసు  నమోదు చేసుకున్న  పోలీసులు కొద్ది రోజులు ఆలస్యంగా  నిందితురాలిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పంజాబ్‌కు  చెందిన కిరణ్ అనే మహిళ   ఫరీదాబాద్, ఐఎంటీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె  భర్త   2018 లో  బ్లడ్ క్యాన్సర్ తో చనిపోవటంతో కారుణ్య నియామకం కింద ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. తన ఇద్దరు కూతుళ్లతో ఆమె ఉద్యోగం చేసుకుని జీవిస్తోంది.  2019 లో ఆమెకు బల్లభ్‌గఢ్ లోని భాటియా కాలనీకి చెందిన పవన్ కటారియా(38) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు.

పవన్‌కు   అప్పటికే   పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం   చేయ సాగారు. పవన్ ఎక్కువ   సమయం కిరణ్ ఇంటివద్దే గడప సాగాడు.  ఈక్రమంలో    కిరణ్ 13 ఏళ్ల   పెద్దకూతురిపై పవన్ కన్నేశాడు.  కిరణ్ కు  తెలియకుండా  ఆ బాలికను   లైంగికంగా వేధించసాగాడు.  ఈవిషయం తెలుసుకున్న కిరణ్ సున్నితంగా పధ్ధతి మార్చుకోమని పవన్ కు  చెప్పింది. అయినా పవన్ వినలేదు.

ఒకరోజు రాత్రి నిద్ర మాత్రలు కలిపిన ఆహరం పెట్టింది.  అది తిన్న పవన్ స్పృహ తప్పి పడిపోయాడు.  ఒక ఆటోను పిలిచి ఆటోలో  పవన్‌ను ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని చెప్పి ….. తీసుకువెళ్లి  ఆటోలో కూర్చో పెట్టింది. అక్కడి నుంచి  ఒక నిర్జన  ప్రదేశానికి తీసుకు వెళ్ళింది.  అక్కడ పవన్‌ను   దింపి ఆటోను పంపించి వేసింది.  అనంతరం తనతో తెచ్చుకున్న పెట్రోల్ పవన్ పై పోసి తగలబెట్టింది.

Also Read : Child Offender : వయస్సు 17, చేసిన నేరాలు 16, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న యువకుడు…

అక్కడి నుంచి సెక్టార్ 75లోని తన ఇంటికి తిరిగి వచ్చి మామూలుగానే పని చేసుకోసాగింది.  ఈలోగా తన సోదరుడు కనపడటం లేదని అక్టోబర్ 18న పవన్ సోదరుడు బల్లభ్ ఘర్ లోని పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.  అక్టోబర్ 17 న సెక్టార్ 75 లో సగం కాలిపోయిన మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆనవాళ్లు సరిగా లేకపోవటంతో అది నైజీరియన్ మృతదేహంగా భావించిన పోలీసులు మార్చురీలో భద్రపరిచారు.

పవన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో  తన సోదరుడు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు పవన్ సోదరుడు. దీంతో కిరణ్ ఆచూకి తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

తానే పవన్‌ను   హత్య చేసినట్లు కిరణ్   ఒప్పుకుంది. తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని… అందుకే హత్యచేశానని నేరం ఒప్పుకుంది.  నిందితురాలిని కోర్టులో హజరు పరిచిన  ఫరీదాబాద్ పోలీసులు తదుపరి విచారణ  నిమిత్తం ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.