Gold Smuggling : మలద్వారంలో ఏడు కిలోల బంగారం-నలుగురు సూడాన్ దేశస్ధులు అరెస్ట్

కస్టమ్స్ అధికారులు ఎంతపటిష్టమైన నిఘా చర్యలు చేపట్టినా విదేశాల నుంచి పలు మార్గాల్లో   బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. 

Gold Smuggling : మలద్వారంలో  ఏడు కిలోల బంగారం-నలుగురు సూడాన్ దేశస్ధులు అరెస్ట్

Gold Smuggling

Updated On : December 11, 2021 / 7:28 AM IST

Gold Smuggling  : కస్టమ్స్ అధికారులు ఎంతపటిష్టమైన నిఘా చర్యలు చేపట్టినా విదేశాల నుంచి పలు మార్గాల్లో   బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.  హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన   విమానంలో నలుగురు సూడాన్ దేశస్ధులు దిగారు. వీరిలోఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు ఉన్నారు.

వారి నడక తీరులో అనుమానం  రావటంతో పోలీసులు వారిని తనిఖీ చేశారు. డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లి పరీక్షించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి బయటకు తీయించారు.
Also Read : Kamya Panjab : విడాకులు తీసుకుంటే చనిపోవాలా? : ఘాటు రిప్లై ఇచ్చిన నటి
స్మగ్లింగ్  చేస్తున్న బంగారం విలువ సుమారు రూ. 3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడకు తరిలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.