Dena Bank : పరిశ్రమ పేరుతో దేనా బ్యాంక్‌కు రూ.3 కోట్లు టోకరా

పరిశ్రమలు స్ధాపించేందుకు, వ్యాపారాలు అభివృధ్ది చేసుకునేందుకు బ్యాంకులు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నవాళ్లు ఉన్నారు.

Dena Bank : పరిశ్రమ పేరుతో దేనా బ్యాంక్‌కు రూ.3 కోట్లు టోకరా

Dena Bank Fraud

Dena Bank :  పరిశ్రమలు స్ధాపించేందుకు, వ్యాపారాలు అభివృధ్ది చేసుకునేందుకు బ్యాంకులు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నవాళ్లు ఉన్నారు. బ్యాంకులను మోసం చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు ముంబైకు చెందిన ఒక కంపెనీ దేనా బ్యాంకును రూ. 3 కోట్ల రూపాయల మోసం చేసింది. లేని కంపెనీ పేరిట లోను తీసుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

హైదరాబాద్ కోఠి లోని దేనా బ్యాంకు బ్రాంచ్‌లో ముంబాయిలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ పేరుతో ఇద్దరు వ్యక్తులు లోన్ తీసుకున్నారు. బ్యాంకు మొదటి విడతగా ప్రాజెక్ట్ రిపోర్ట్ పరిశీలించి రూ. 3 కోట్లు సదరు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తులకు లోన్ మంజూరు చేసింది.

అనంతరం కంపెనీ పరిశీలించేందుకు ముంబాయి వెళ్ళిన దేనా బ్యాంక్ అధికారులు షాక్‌కు గురయ్యారు. లోన్ తీసుకున్న వ్యక్తులు ఇచ్చిన అడ్రస్‌లో కంపెనీ లేకపోవటంతో….. లోన్ తీసుకొని మోసం చేశారని గమనించిన దేనా బ్యాంక్ అధికారులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు సంస్ధ పేరు మీద లోను తీసుకున్న వ్యక్తులపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసారు.

Also Read : Telangana Employees : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల విభజన, బదిలీలు

కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు జరిపి ముంబాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు…..చార్టెడ్ అకౌంటెంట్ కిషోర్ కుమార్, బండి శ్రీకాంత్ రెడ్డి లను అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరు పరచి రిమాండ్ తరలించారు.