Hash Oil : రామగుండంలో హాష్ ఆయిల్ స్వాధీనం

తెలంగాణలోని రామగుండం పారిశ్రామికవాడలో కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఇన్నాళ్లు హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరుగుతున్న సంఘటనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అదే క్రమంలో ఏదో

Hash Oil : రామగుండంలో హాష్ ఆయిల్ స్వాధీనం

Hash Oil

Hash Oil :  తెలంగాణలోని రామగుండం పారిశ్రామికవాడలో కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఇన్నాళ్లు హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరుగుతున్న సంఘటనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అదే క్రమంలో ఏదో ఒక మూలన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

గంజాయి నుంచి తీసిన ద్రావణం పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున చేతులు మారుతోంది. అధిక శాతం యువత గంజాయి మత్తులో భవిష్యత్తు నిర్వీర్యం చేసుకుంటున్నారు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో మూలన గంజాయి అక్రమ రవాణా చాప కింద నీరులా సరఫరా అవుతోంది.

ఇదే క్రమంలో గంజాయి నుంచి తీసిన ద్రావణాన్ని (హాష్) సరఫరా చేస్తున్న ఐదుగురు యువకులను గోదావరిఖని అబ్కారి శాఖ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 9 లక్షల  రూపాయలు విలువ చేసే 900 మిల్లి లీటర్ల ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గోదావరిఖని ఎక్సైజ్ శాఖ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ వివరాలను వెల్లడించారు.
Also Read : Protect Women: 56ఏళ్ల మహిళపై రేప్, ఐరన్ రాడ్‌తో టార్చర్

రామగుండం విద్యుత్ నగర్ కు చెందిన వినీత్, శశి, నరసింహాచారి, మహేష్ లతో పాటు వైజాగ్ అరకు ప్రాంతానికి  చెందిన ఒకరు రెండువేల మిల్లీ లీటర్ల ద్రావణాన్ని తీసుకువచ్చారు. చిన్న చిన్న బాటిళ్లలో నింపి 2వేల రూపాయల చొప్పున విక్రయిన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి నుంచి 900 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి నుంచి తీసిన ఈ ద్రావణాన్ని సిగరెట్ లో కలుపుకుని హుక్కా లా పిల్చుతారని పోలీసులు తెలిపారు.