దొంగ నిజాయితీ.. బ్యాగులో బంగారం వద్దని.. రూ.2వేలు దొంగిలించాడు!

  • Published By: sreehari ,Published On : August 8, 2020 / 07:25 PM IST
దొంగ నిజాయితీ.. బ్యాగులో బంగారం వద్దని.. రూ.2వేలు దొంగిలించాడు!

దొంగల్లో మంచి దొంగ కూడా ఉంటారేమో.. లక్షలు విలువ చేసే బంగారం వద్దని కేవలం రూ.2 వేల కోసమే దొంగతనం చేశాడు.. తనకు అవసరమైన డబ్బును మాత్రమే తీసుకుని బ్యాగులోని బంగారపు పుస్తెల తాడును వదిలేసి పోయాడు..

ఆ బ్యాగును దగ్గరలోని ఓ చెట్టు కుండీలో వేసి వెళ్లాపోయాడు. అంతేకాదు.. తన దొంగతనాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు కూడా.. పక్కనే ఉన్నగోడపై ఇలా రాసి పోయాడు.. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది.



మామిళ్లగూడెంలోని రిటైర్డ్ ఉద్యోగి బాబ్జీ నివాసముంటున్నాడు.. రాత్రి ఇంట్లో ఓ దొంగ చొరబడ్డాడు.. కిటికీ జాతీ తొలగించి లోపలికి ప్రవేశించాడు.. కర్రతో ఇంట్లో గోడకు తగిలించిన బ్యాగును కొట్టేశాడు.. అందులో రూ.2 వేల నగదుతో పాటు రూ. 2లక్షల విలువైన బంగారపు పుస్తెల తాడు కూడా ఉంది.

బ్యాగులో 2వేలు మాత్రమే తీసుకున్నాడు.. బ్యాగులో బంగారం మాత్రమే అలా ఉంచి చెట్టు కుండీలో పడేసిపోయాడు.. పక్కనే ఉన్న గోడపై.. క్షమించండి.. నాకు డబ్బులు అత్యవసరం.. అందుకే రూ.2వేలు తీసుకుంటున్నా.. మీ బంగారాన్ని చెట్టు కుండీలో వదిలి వెళ్తున్నా..’ అని తెలుగులో రాశాడు..



ఉదయం నిద్రలేచిన బాబ్జీ కుటుంబ సభ్యులు బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. బ్యాగు ఏమైందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు.. ఇంటి పరిసరాల్లోకి వెతుకుతుండగా.. కిటికి పక్కనే ఉన్న గోడపై దొంగ రాసిన రాతలు చూసి అవాక్కయ్యారు.. చెట్టు కుండీలో బ్యాగును చూసి ఆనందపడ్డారు..



అందులో బంగారం అలానే ఉంది.. కానీ, రూ.2వేలు మాత్రం కనిపించలేదు. బంగారమైనా మిగిలిందిలే.. అంటూ సంతోషపడ్డారు.. ఈ విషయాన్ని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.