అయోధ్య తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు : యువకుడి అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : November 13, 2019 / 01:10 PM IST
అయోధ్య తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు : యువకుడి అరెస్ట్

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేసారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. నవంబర్ 13 బుధవారం ఇండోర్ లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 9న అయోధ్య రామజన్మ భూమి అంశం పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందినజితేంద్ర చౌహాన్ అనే వ్యక్తి తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు.

అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దనివాటిపై నిఘా ఉంటుందని ముందుగానే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర  ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో ఇండోర్ కు చెందిన జితేంద్ర చౌహాన్  సుప్రీం కోర్టు తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. అవి పెద్దఎత్తున షేర్ అయి, వాటికి కామెంట్లు వచ్చినట్లు గుర్తించారు. 

దీనిపై  నిఘా పెట్టిన పోలీసులు  ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని  గుర్తించారు. ఇండోర్ శివార్లలో అతడిని  బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జితేంద్ర చౌహాన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అతడిని న్యాయస్ధానంలో హజరుపరిచి, రిమాండ్ కు తరలించారు.