జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 03:29 AM IST
జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్ : ఇటీవల హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాకేష్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రమేయంపైనా ఆధారాలు సేకరించారు పోలీసు అధికారులు. జయరాం హత్య కేసుకు సంబంధించి ఫిబ్రవరి 20 బుధవారం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఐదుగురు పోలీసు అదికారులను విచారించనున్నారు. ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ తోపాటు మరో ముగ్గురు పోలీస్ అధికారులను విచారణ చేయనున్నారు. 

జయరాం హత్య తర్వాత… యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ఓ పోలీసు అధికారి సలహా ఇచ్చారు. నిన్న నందిగామ వెళ్లి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేశారు. నిందితుడు రాకేష్‌రెడ్డికి ఓ టీడీపీ నేతతో ఉన్న పరిచయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆ టీడీపీ నేతను విచారణకు పిలిచే అవకాశం ఉంది.