Jubilee Hills : గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి-బండి సంజయ్

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Jubilee Hills : గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి-బండి సంజయ్

Bandi Sanjay Kumar

Jubilee Hills Gang Rape Case :  జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని…ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం అని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని… రిమాండ్‌కు తరలించే వరకు ఇదే ప్రయత్నం కొనసాగిందని ఆయన అన్నారు.

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ లు అండగా ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధైర్యం తో నేరస్తులు రెచ్చిపోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతగాని తనం ఈ కేసుతో బయటపడిందని.. బీజేపీ ఆందోళన చేపట్టిన తరువాత నే ఈ మాత్రం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. ఎంఐఎం కోసం ముఖ్యమంత్రి  కేసీఆర్ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు…రాష్ట్రంలో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అన్న కేటీఆర్ ఏడున్నడు…కేసీఆర్ కుటుంబం చెప్పే వరకు జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

రాష్ట్రం లో రోజుకో  అత్యాచార  సంఘటన బయటకు వస్తోందని, మీడియా, సోషల్ మీడియా ద్వారా అత్యాచార ఘటనలు బయట పెడుతున్నాయని  ఆయన చెప్పారు. మే 30వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ?  విచారణ చేపట్టలేదు ?  అని ఆయన ప్రశ్నించారు.   బాధితులకు అండగా బీజేపీ పోరాటం చేస్తుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు. డీసీపీ మొదటి రోజు ఎమ్మెల్యే కొడుకు లేడని చెప్పాడు ….ఇన్ని రోజుల వరకు కార్ ఎందుకు సీజ్ చేయ్యలేదు.. ఎమ్మెల్యే కొడుకు ను 6వ  నిందితుడుగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.. చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులు వైఫల్యం చెందారు..  ఆధారాలను తారుమారు చేసి కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని పోలీసుల తీరును  బండి సంజయ్ తీవ్రంగా దుయ్యబట్టారు.

Also Read : Nitish Kumar: మ‌త‌మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టం అవ‌స‌రం లేదు: నితీశ్ కుమార్
నిందుతులు ప్లాన్ ప్రకారమే కసితో బాలికపై రేప్ చేసారని… ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు అని ఆయన చెప్పారు. బీజేపీ కోర్టుల ముందు ఆందోళన చేస్తాం అని చెప్పినందుకు నిన్న నిందితులను రిమాండ్ చేసారని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ లపై కేసు పెట్టిన పోలీసులు, నిందితులపై ఎందుకు కేసులు పెట్టడం లేద్ననారు. కేసీఆర్ ఒత్తిడితో ఏ ఘటన జరిగినా పోలీసులు మతపరంగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw