మ్యూజీషియన్ బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తు

  • Published By: chvmurthy ,Published On : December 10, 2019 / 10:27 AM IST
మ్యూజీషియన్ బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తు

కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్ బాలభాస్కర్ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్‌తోపాటు అతని రెండేళ్ల కూతురు కన్ను మూశారు. అయితే బాల భాస్కర్‌ది అనుమానాస్పద మృతిగా ఆరోపిస్తూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ ప్రభుత్వం బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది.

బాలభాస్కర్ ప్రయాణిస్తున్న కారు తిరువనంతపురం సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారి పక్కనున్న చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలభాస్కర్ భార్య లక్ష్మి, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బాలభాస్కర్ డ్రైవింగ్ చేస్తున్నాడని డ్రైవర్ చెబుతుండగా..అతని భార్య మాత్రం డ్రైవరే కారు నడుపుతున్నాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి.