Kolkata-Doha flight evacuated:కోల్‌కతా-దోహా విమానానికి బాంబు బెదిరింపు

Kolkata-Doha flight evacuated:కోల్‌కతా-దోహా విమానానికి బాంబు బెదిరింపు

Qatar Airways flight

Kolkata-Doha flight Bomb Scare: కోల్‌కతా-దోహా విమానానికి బాంబు బెదిరింపుతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు.మంగళవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూఆర్ 541కి బయల్దేరిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానం దోహా వెళ్లేందుకు సిద్ధం కాగా ఓ ప్రయాణికుడు ఆ విమానంలో బాంబు ఉందంటూ అప్రమత్తం చేశారు.(man triggers Bomb Scare) దీంతో విమానాశ్రయ అధికారులు విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా విమానంలో ఉన్న మొత్తం 186 మందిని తరలించారు.

WFI chief Brij Bhushan: గోండా వచ్చిన ఢిల్లీ పోలీసులు…బ్రిజ్ భూషణ్‌ను ప్రశ్నించారు

ప్రయాణికులను దింపేసి బాంబు కోసం స్నిఫర్ డాగ్‌లతో వెతికారు.విమానాశ్రయ సిబ్బంది వేగంగా పనిచేసి విమానాశ్రయంలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్)ని అప్రమత్తం చేశారు.సీఐఎస్ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసి విమానంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు ఉందని చెప్పి వ్యక్తికి మతిస్థిమితం లేదని అతని తండ్రి చెప్పి దానికి సంబంధించిన వైద్య పత్రాలు సమర్పించారు. విమానంలో తనిఖీలు చేశాక బాంబు లేదని తేలడంతో విమానం ఉదయం 9 గంటలకు దోహాకు బయలుదేరింది.బాంబు బెదిరింపు వల్ల విమానం ఆలస్యంగా బయలుదేరింది.