Father Chops Son Body : దారుణం.. ఐదేళ్ల కొడుకును ఏడు ముక్కలుగా నరికిన తండ్రి.. ఎందుకో తెలుసా?

ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది వ్యక్తులు.. మాయలు, మంత్రాలు, తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.

Father Chops Son Body : దారుణం.. ఐదేళ్ల కొడుకును ఏడు ముక్కలుగా నరికిన తండ్రి.. ఎందుకో తెలుసా?

Father Chops Son Body

Father Chops Son Body : ఇది సైన్స్ యుగం. మనిషి స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ.. హై స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది వ్యక్తులు.. మాయలు, మంత్రాలు, తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి.. తాంత్రిక మహిళ చెప్పిందని దారుణానికి ఒడిగట్టాడు. పసివాడు అనే కనికరం కూడా లేకుండా కన్న కొడుకునే హతమార్చాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘోరం జరిగింది.

అలీరాజ్‌పూర్‌ కర్ కార్డి గ్రామానికి చెందిన దినేష్ దవర్ వ్యవసాయం చేస్తాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల అతని ఐదేళ్ల చిన్న కొడుకు రామ్ అనారోగ్యం బారిన పడ్డాడు. అయితే మూఢనమ్మకాలు ఉన్న దినేష్.. కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఒక మహిళా తాంత్రికురాలి దగ్గరికి తీసుకెళ్లాడు.

WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!

ఆమె.. దినేష్ కు మాయ మాటలు చెప్పింది. బిడ్డకు దెయ్యం పట్టిందని, అది పోవాలంటే బాలుడుని గొడ్డలితో 7 ముక్కలుగా నరికి గోతిలో పాతిపెట్టాలని చెప్పింది. దీంతో అతడు ముందు వెనుక ఆలోచించకుండా ఆ మహిళ చెప్పినట్లు కన్నకొడుకును చంపేశాడు. గొడ్డలితో 7 ముక్కలు నరికాడు. ఆ తర్వాత తన పొలంలోనే గొయ్యి తవ్వి అందులో పాతిపెట్టాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి చివరకు పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దినేష్ ని అరెస్ట్ చేశారు. బాలుడికి దెయ్యం పట్టిందని, అది వదలాలంటే ఇలా చేయాలని తాంత్రిక మహిళ చెప్పిందని, అందుకే తాను ఇలా చేశానని దినేష్ పోలీసులతో చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్లు 302, 201 కింద పోలీసులు దినేష్ పై కేసు నమోదు చేశారు. సైన్స్ విపరీతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ అలీరాజ్ పూర్ జిల్లాలో ఇలాంటి అంధ విశ్వాసాలు నమ్మే వారు ఎక్కువగా ఉన్నారు. ఇంకా మాయలు, మంత్రాల్లో మునిగి తేలుతున్నారు. ఈ పిచ్చి నమ్మకాలతో ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతం అలీరాజ్ పూర్.