కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 10:49 AM IST
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్ లోని ఓ ఆగ్రో-కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బరూచ్ జిల్లాలోని దహెజ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని యశశ్విని రాసయాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇవాళ(జూన్-3,2020)మధ్యాహ్నాం ఒక్కసారిగా పెద్ద బాస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసినపడ్డాయి. మంటల కారణంగా పెద్ద ఎత్తున పొగలు చుట్టుపక్కల ఏరియాలను కమ్మేశాయి. 

సమాచారం అందుకున్న ఫైరింజన్ డిపార్ట్మెంట్…మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ట్రక్కులతో స్పాట్ కు చేరుకుంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా 40మంది వర్కర్లు గాయపడినట్లు సమాచారం. మరోవైపు,ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల రెండు గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కంపెనీలోని బాయిలర్ పేలినట్లు బరూచ్ కలెక్టర్ ఎండీ మోడియా తెలిపారు. గాయపడిన వారిని బరూచ్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించినట్లు తెలిపారు.

Read: కాపాడమని కోర్టుకెళ్లిన నవ దంపతులకు రూ.10వేలు జరిమానా..ఎందుకంటే