Gurgaon: కూతురు కిడ్నాప్.. తండ్రి సాహసం.. రెండు గంటలు కారును వెంటాడి, నిందితుడిని పట్టుకున్న తండ్రి

ఒక బాలికను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో యువకుడు. అయితే, ఆ కారును వెంటాడారు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు. చివరకు నిందితుడు కారు వదిలేసి అడవిలోకి పారిపోయాడు.

Gurgaon: కూతురు కిడ్నాప్.. తండ్రి సాహసం.. రెండు గంటలు కారును వెంటాడి, నిందితుడిని పట్టుకున్న తండ్రి

Gurgaon: పదమూడేళ్ల బాలికను కారులో కిడ్నాప్ చేశాడో యువకుడు. గమనించిన బాలిక తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. బాలికను రక్షించారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీ, గుర్గావ్‌లోని బోండ్సి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి పది గంటల సమయంలో పదమూడేళ్ల బాలిక ఇంటి నుంచి నీళ్ల కోసం బయటకు వచ్చింది.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

ఆ సమయంలో బాలిక కుటుంబ సభ్యులు ఇంట్లో టీవీ చూస్తున్నారు. అదే సమయంలో ఒక యువకుడు కారులో అక్కడికి వచ్చాడు. ఇంటి బయట ఒంటరిగా ఉన్న బాలికను చూశాడు. ఏదో కారణంతో కొద్దిసేపు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తర్వాత చుట్టూ ఎవరూ లేరనుకుని, బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. దూరంగా ఉన్న ఒక వ్యక్తి ఇది చూశాడు. వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. స్పందించిన బాలిక తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు బైకులపై కారును వెంటాడారు. తన కారు వెంట బాలిక కుటుంబ సభ్యులు వస్తున్నారని గమనించిన కారులోని వ్యక్తి.. కారును, అందులోని బాలికను అక్కడే వదిలేసి, కారు దిగి పారిపోయాడు. పక్కనున్న చెట్లలోకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

Bengaluru: మద్యం మత్తులో ఉన్న యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం.. మరో వ్యక్తితో కలిసి దురాగతం

అయినప్పటికీ అతడిని బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు వెంటాడారు. దాదాపు రెండు గంటలపాటు ప్రయత్నించి అతడిని పట్టుకున్నారు. తర్వాత ఆ యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని ప్రీతమ్ (22)గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూతురు కిడ్నాప్ విషయంలో సకాలంలో స్పందించిన తండ్రి… తన కూతురును రక్షించుకోగలిగాడు.