బట్టలు చించి, అసభ్యంగా ప్రవర్తించారు : బంజారాహిల్స్ పోలీసులపై వివాహిత సంచలన ఆరోపణలు

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని అట్లూరి ప్రవిజ అనే వివాహిత ఆరోపించారు.

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 12:07 PM IST
బట్టలు చించి, అసభ్యంగా ప్రవర్తించారు : బంజారాహిల్స్ పోలీసులపై వివాహిత సంచలన ఆరోపణలు

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని అట్లూరి ప్రవిజ అనే వివాహిత ఆరోపించారు.

తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే… కొంతమంది పోలీసు అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించి.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వెలుగుచూసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు.

పోలీస్ స్టేషన్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని అట్లూరి ప్రవిజ అనే వివాహిత ఆరోపించారు. తన బట్టలు చించి చిత్ర హింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజినెస్ వివాదంలో తన భర్తపై కేసు నమోదైతే పోలీసులు తనను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారని, రాత్రి దాకా అక్కడే ఉంచి తన పట్ల నీచంగా ప్రవర్తించారని ప్రవిజ ఆరోపించారు. తనపైన కూడా అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని సీఐ కళింగరావు బెదిరించారని వాపోయింది. 

2019, డిసెంబర్ 8న పోలీసులు తనకు కాల్ చేసి పిలిచారని ప్రవిజ తెలిపింది. ఒక సివిల్ డిస్ప్యూట్ లో పోలీసులు ఇన్ వాల్వ్ అయి, 7 నెలలుగా తనను, తన భర్తను వేధిస్తున్నారని ఆరోపించారు. అపాలజీ లెటర్ రాపిస్తామని ప్రామిస్ చేసి, నమ్మించి గత ఆదివారం సాయంత్రం పిలిపించారని చెప్పారు. డిసెంబర్ 8 సాయంత్రం 4 గంటలకు పోలీసులు రమ్మని పిలిపించారని తెలిపారు. పోలీసులంటే నమ్మకస్తులని నమ్మి వెళ్లామని చెప్పారు. వారి దగ్గరకు వెళ్లిన తర్వాత తమతో చాలా అసభ్యంగా మాట్లాడి, మిస్ బిహేవియర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆడియో రికార్డులన్ని తమ దగ్గర ఉన్నాయని.. తాము సబ్ మిట్ చేస్తామని చెప్పారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల సమయంలో తమను ఫస్ట్ ఫ్లోర్ లోని డీఐ రూమ్ కు తీసుకెళ్లారని తన హ్యాండ్ బ్యాగ్, తమ దగ్గర ఉన్న ఫైల్స్, సెల్ ఫోన్స్ తీసుకున్నారని తెలిపారు. తన డ్రెస్ చింపేసి, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ మీడియా ముందుకొని విధంగా మిస్ బిహేవియర్ చేశారని వాపోయారు.