ప్రణయ్ హత్య కేసు : డిసెంబర్ 17న తుది తీర్పు..ఏ శిక్ష విధిస్తారో

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 01:42 PM IST
ప్రణయ్ హత్య కేసు : డిసెంబర్ 17న తుది తీర్పు..ఏ శిక్ష విధిస్తారో

నల్గొండలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దుపై విచారణ ముగిసింది. నల్గొండ జిల్లా కోర్టు 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. ప్రణయ్ భార్యను బెదిరించినట్లు రుజువు కావడంతో మరోసారి మారుతీరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

వరంగల్ సెంట్రల్ జైలులో ఉండి..బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతీ రావు..కుమారుడి హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలంటూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు కంప్లయింట్ చేశారు. 

* కూతురు ప్రణయ్‌ని కులాంతర వివాహం చేసుకోవడం మారుతీ రావుకు నచ్చలేదు. 
* 2018, జనవరి 31 ప్రణయ్ వివాహం జరిగింది. 
* 2018, సెప్టెంబర్‌ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన..మారుతీ రావు..ప్రణయ్‌ని అతి దారుణంగా హత్య చేయించాడు.
* ఈ పరువు హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 
 

* జూన్ 12వ తేదీన పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. 1600 పేజీల ఛార్జీషీట్‌ను న్యాయస్థానంలో సమర్పించారు. 
* కూతురు తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్, ఎంఏ కరీం, అస్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. 
* మారుతీ రావు, శ్రవణ్, కరీం ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. 
* తన భర్తను కిరాతకంగా హత్య చేసిన తండ్రి మారుతీ రావును కఠినంగా శిక్షిచాలని డిమాండ్ చేస్తోంది. 
Read More : దిశా నిందితుల ఎన్ కౌంటర్ : మృతదేహాల అప్పగింతపై సందిగ్ధత