Mumbai Robbery : 22 ఏళ్ల క్రితం దోపీడీ..ఈనాటికి చేతికందిన బంగారం..అప్పటి విలువ రూ.13 లక్షలు ఇప్పుడు రూ.8 కోట్లు

22 ఏళ్ల క్రితం దోపీడీ తర్వాత ఫిర్యాదు దారులకు చేతికందింది బంగారం..దోపిడీ జరిగినప్పుడు ఈ బంగారం విలువ రూ.13 లక్షలు. కానీ ఇప్పుడు రూ.8 కోట్లుపైనే విలువ కావటం విశేషం.

Mumbai Robbery : 22 ఏళ్ల క్రితం దోపీడీ..ఈనాటికి చేతికందిన బంగారం..అప్పటి విలువ రూ.13 లక్షలు ఇప్పుడు రూ.8 కోట్లు

Gold Rate

Mumbai family stolen gold worth Rs 8 crore returned after 22 years :  సాధారణంగా దొంగలు దోచుకున్న డబ్బు అయినా..వెండి,బంగారం విలువైన వస్తువులైన తిరిగి చేతికి అందటం చాలా కష్టం. పోలీసులు దొంగలను పట్టుకుని దోచిన సొత్తును స్వాధీనం చేసుకున్నా అది బాధితులకు దక్కటం అనేది చాలా చాలా అరుదు. అటువంటిది 22 ఏళ్ల క్రితం దోచుకున్న రూ.13 లక్షల విలువైన బంగారం తిరిగి దక్కింది బాధిత కుటుంబానికి. దోపిడీ జరిగినప్పుడు ఆ బంగారం విలువ రూ.13లక్షలు అయితే అదే ఇప్పటి విలువ రూ.8 కోట్లు కావటం విశేషం.

1998లో ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జన్ దాస్వానీ కుటుంబం పై ఒక దొంగల ముఠా కత్తులతో దాడి చేసి..కుటుంబంలో అందరిని తాళ్లతో కట్టేసి మరీ దోచుకుపోయింది. దొంగలు అర్జన్ దాస్వానీని, అతని భార్యను తాళ్లతో కట్టేసి రూ.13 లక్షల విలువైన బంగారాన్ని దోచుకుపోయిందా ముఠా. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు.

Also read : రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ, డిన్నర్‌లో మత్తుమందు కలిసి రూ.30లక్షల విలువైన బంగారం చోరీ

దొంగలు దోచుకున్న బంగారం మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.1999లో విచారణలో ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. కానీ ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ సొత్తు అంతా పోలీసుల స్వాధీనంలోనే ఉంది. మరోపక్క ఆ బంగారాన్ని భద్రంగా ఉంచటం పోలీసులకు పెద్ద టాస్క్ గానే ఉంది.

అలా ఏళ్లు గడిచిపోయాయి. సదరు బాధిత కుటుంబం అర్జన్ దాస్వానీ కుటుంబం సొమ్ము ఎప్పుడు చేతికి అందుతుందా? అని ఆశగానే ఎదురు చూశారు. చూస్తునే ఉన్నారు. కానీ ఈ కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సుదీర్ఘంగా కొనసాగుతునే ఉంది. ఈ కేసుపై విచారించిన సెషన్‌ కోర్టు..ఫిర్యాదుదారునికి సొత్తు ఇవ్వకుండా 19 ఏళ్లకుపైగా ఎదురు చూసేలా చేయటం సరికాదని భావించింది. వారి సొమ్ము వారికి దక్కకుండా ఉండటం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ సొత్తును షరతులతో బాధిత కుటుంబానికి అందజేయాలని తీర్పునిచ్చింది. ఆ సొత్తును షరుతులతో కూడిన నిబంధనలకు లోబడి అందజేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Also read : వీడు మాములోడు కాదు : ట్రంప్ మాస్క్ తో బంగారం దోపిడీ

దీంతో పలు షరతులు విధించిన పోలీసులు ఈ సొత్తును షరుతులతో కూడిన నిబంధనలు అన్ని కూలకషంగా నిర్వహించిన పోలీసులు అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని దోపిడీ జరిగిన సొత్తుకు సంబంధించిన బిల్లులను కోర్టుకు, పోలీసులకు సమర్పించారు. అలా అన్ని ఆధారాలు సమర్పించి తమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలా 22 ఏళ్ల​ నిరీక్షణ తర్వాత సొంతం అయిన ఆ ఆస్తి విలువ కాస్త అప్పుడు రూ.13 లక్షలు కాగా..ఇప్పుడు రూ 8 కోట్లు పైనే విలువ కావటం విశేషం.

ఈ సొమ్ము ఫిర్యాదుదారి కుటుంబానికి అందజేసే విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్బాల్ సోల్కర్, కోల్బా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ డోనార్ మాట్లాడుతూ..ఆస్తిని తిరిగి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని..రాజు దాస్వానీ దోపిడీ సొత్తుకు సంబంధించి అన్ని బిల్లులు, రసీదులను సమర్పించారని దీంతో అతని కుటుంబానికి చెందినదని ధృవీకరించి దోపిడీ అయిన సొత్తును అందజేశామని తెలిపారు.