Mumbai Cheating : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లో రూ. 22,396 కొట్టేశారు.. అసలేం జరిగిందంటే? 

Mumbai Cheating : సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల కేసులు అధిక స్థాయిలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Mumbai Cheating : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లో రూ. 22,396 కొట్టేశారు.. అసలేం జరిగిందంటే? 

Mumbai man loses Rs 22,396 from bank account after clicking on unverified link, here is the full story

Mumbai Cheating : సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల కేసులు అధిక స్థాయిలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసి మహిళ బ్యాంక్ నుంచి సుమారు రూ.5 లక్షలు పొగొట్టుకుంది. ఆన్‌లైన్‌లో వస్తువును ఆర్డర్ చేసిన సమయంలో వాట్సాప్ స్కామ్‌ (Whatsapp Scam)లో వ్యక్తి రూ. 44,782 కోల్పోయాడని నివేదిక తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ (Netflix Subscription)ను రెన్యువల్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆన్‌లైన్ మోసంలో సుమారు రూ. 1 లక్షను కోల్పోయాడు.

బ్యాంకు, OTP మోసాలు చాలా సాధారణం. ఆన్‌లైన్ మోసంలో 29 ఏళ్ల వ్యక్తి రూ.22వేలకు పైగా కోల్పోయాడు. నివేదిక ప్రకారం.. ముంబైకి చెందిన వ్యక్తి మోసగాళ్ల చేతుల్లో రూ. 22,396 పోగొట్టుకున్నాడు. బట్టల షాపులో సేల్స్ మేనేజర్ అయిన రాంసింగ్ రాజ్‌పుత్‌కు కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నట్టుగా మెసేజ్ వచ్చింది. అది నిజమని నమ్మిన బాధిత వ్యక్తి.. సైబర్ మోసగాడు పంపిన లింకుపై క్లిక్ చేయగానే తన మొబైల్ నెంబర్‌కు OTP వచ్చింది. ఆ OTP చెప్పగానే వెంటనే అతడి బ్యాంకు అకౌంట్లో నుంచి రూ. 22,396 మాయమయ్యాయి.

Read Also : Tecno Phantom X2Pro : టెక్నో ఫాంటమ్ X2 Pro సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేసిందోచ్.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

జనవరి 15న బ్యాంకు నుంచి కాల్ వచ్చినట్టుగా నమ్మించారు. అతడి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్‌డేట్ చేసేందుకు మోసగాడు అతనికి ఒక లింక్ పంపాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్‌లో వచ్చిన OTPని ఎంటర్ చేయమని అడిగాడు. అంతే.. బ్యాంకు అకౌంట్ నుంచి రూ.22,396 నగదు బదిలీ అయింది.

Mumbai man loses Rs 22,396 from bank account after clicking on unverified link, here is the full story

Mumbai Cheating : Mumbai man loses Rs 22,396 from bank account after clicking on unverified link

సెప్టెంబరు 2022తో ముగిసిన 6 నెలల కాలంలో బ్యాంకింగ్ మోసాల కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక వెల్లడించింది. రూ. 87 కోట్లతో 2,331 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. RBI వివరాల ప్రకారం.. 2021తో పోలిస్తే.. సైబర్ మోసాల కేసుల సగటు సంఖ్య తగ్గింది.

బ్యాంకు OTPలను ఎవరితోనూ షేర్ చేయరాదని వినియోగదారులకు ఆర్బీఐ సూచించింది. చాలామంది యూజర్లు సాధారణంగా OTPని తెలియని వ్యక్తులతో షేర్ చేయరాదని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయరాదని హెచ్చరిస్తోంది. గుర్తు తెలియని కాలర్‌ ద్వారా కాకుండా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే బ్యాంక్ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple Watch ECG Feature : మహిళ ప్రాణాన్ని కాపాడిన ఆపిల్ వాచ్.. హార్ట్‌లో బ్లాక్ గుర్తించి అలర్ట్ చేసిన ఈసీజీ ఫీచర్..!