ముంబై నుంచి లైవ్ లో ఆత్మహత్యాయత్నం….ఐర్లాండ్ నుంచి అలర్ట్ చేసిన ఫేస్ బుక్ సిబ్బంది

ముంబై నుంచి లైవ్ లో ఆత్మహత్యాయత్నం….ఐర్లాండ్ నుంచి అలర్ట్ చేసిన ఫేస్ బుక్ సిబ్బంది

Mumbai young man attempts suicide facebook live stream, saved by local police : ముంబై కి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుని…. తన ఫేస్ బుక్ పేజీలో లైవ్ పెట్టాడు. అది చూసినన  ఐర్లాండ్ లోని  ఫేస్ బుక్ సిబ్బంది ముంబై పోలీసులను అప్రమత్తం చేసి అతడి ప్రాణాలు కాపాడారు.

ముంబై లోని ధూలే  ప్రాంతానికి చెందిన యువకుడు(23) ఆదివారం రాత్రి గం.8-10 సమయంలో ఫేస్ బుక్ లో లాగిన్ అయి అత్మహత్యచేసుకుంటూ లైవ్ పెట్టాడు. ఈదృశ్యాలను ఐర్లాండ్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం సిబ్బంది చూశారు. వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ముంబై డీసీపీ రష్మి కరాండికర్ కు యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం చెప్పి … స్క్రీన్ షాట్లను పంపించారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆయువకుడు ఏడుస్తూ కనిపించాడు. ఫేస్ బుక్ వారు అందించిన ఆధారాలతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు   ఆయువకుడు ఉన్న ఇంటిని గుర్తించారు.

మొత్తం 20 నిమిషాల వ్యవధిలో  యువకుడు నివసిస్తున్న ఇంటికి  చేరుకున్నారు. అప్పటికే గొంతు కోసుకుని రక్తపు మడుగులో ఉన్న యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు యువకుడికి ప్రాణాపాయం లేదని చెప్పారు.