Tamilnadu MVI killed : తమిళనాడులో మరో ప్రభుత్వ ఉద్యోగి హత్య

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన మరువక ముందే   మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను వాహానంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన

Tamilnadu MVI killed :   తమిళనాడులో మరో ప్రభుత్వ ఉద్యోగి హత్య

Tamilnadu Mvi killed

Tamilnadu MVI Killed :  తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన మరువక ముందే   మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను వాహానంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది.

కరూర్ రీజనల్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కనకరాజ్(57) సోమవారం ఉదయం కరూర్‌ బైపాస్‌ రోడ్డులోని పుత్తాం పుదుర్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనం ఆయన్నుఢీ కొట్టివెళ్ళి పోయింది.

స్ధానికులు ఆయన్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నివసిస్తున్న కోయంబత్తూరుకు తరలించారు.

మొదట అది ప్రమాదవశాత్తు జరిగిందిగా బావించారు. కేసు నమోదు చేసుకున్న కరూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కనకరాజ్‌ను మహిళలను ఎక్కించుకుని వెళ్తున్న ఒక వ్యాన్ ఢీ కొట్టి వెళ్లినట్లుగా గుర్తించారు.  జౌళి సంస్ధకు చెందిన ఆ వ్యాను అనుమతులు లేకుండా….పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తోంది.

Also Read : Tamilnadu SI Murder Case : వదిలేయమని బతిమలాడినా కనికరించలేదు… అందుకే చంపేసాం

దాన్ని ఆపి తనిఖీ చేయటానికి కనకరాజ్ ప్రయత్నించారు. వ్యాన్ డ్రైవర్ ఆపకుండా కనకరాజ్ ను ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయాడు. వ్యానును పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వ్యాన్ డ్రైవర్ కోసం  గాలిస్తున్నారు.  ఈ ఘటనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.