మూడు రోజుల్లో ఉరి : నిర్భయ దోషుల నాటకాలు కంటిన్యూ

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 12:56 PM IST
మూడు రోజుల్లో ఉరి : నిర్భయ దోషుల నాటకాలు కంటిన్యూ

నిర్భయ దోషుల అత్యాచారం కేసులో దోషులకు మార్చి 3న అమలు కావలసిన ఉరి తీత మరోసారి వాయిదా పడే అవకాశం ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే వీరు నాటకాలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంది ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తున్నారు. దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఇప్పటికే ఇతను మెర్సీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కానీ దీనిని రాష్ట్రపతి కొట్టిపారేశారు. అప్పటి పిటిషన్‌లో సరైన వివరాలు పొందుపర్చలేదన్న కారణంతో అక్షయ్‌ మరలా…మెర్సి పిటిషన్‌ వేశాడు. మెర్సి పిటిషన్‌ పెండింగ్‌లో ఉంటే దోషులను ఉరితీయడం కుదరదు. దీంతో నిర్భయ న్యాయం కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిర్భయ దోషులకు  2020, మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ పటియాల హౌస్‌ కోర్టు కొత్త వారెంట్‌ జారీ చేసింది. 

మరోవైపు నిర్భయ కేసులో మరో దోషి పవన్‌ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఐదుగురు జడ్జిల ధర్మాసనం దీనిపై మార్చి 2 విచారణ జరపనుంది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలంటూ పవన్‌ పిటిషన్‌లో కోరాడు. ఇప్పటికే ముగ్గురు నిర్భయ దోషుల క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్‌ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించే అవకాశం ఉంది.

నిర్భయ కేసులో దోషులకు ఇప్పటికే డెత్‌ వారెంట్‌ రెండుసార్లు వాయిదా పడింది.న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు.

Read More : goli maro : రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్