Chhattisgarh : దారుణం: దొంగతనం నేరంతో చెట్టుకు వేలాడదీసి కొట్టారు

చత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణతో ఒక సెక్యూరిటీ గార్డును కొందరు చెట్టుకు వేలాడదీసి కొట్టారు.

Chhattisgarh : దారుణం: దొంగతనం నేరంతో చెట్టుకు వేలాడదీసి కొట్టారు

Chhattisgarh  

Chhattisgarh :  చత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణతో ఒక సెక్యూరిటీ గార్డును కొందరు చెట్టుకు వేలాడదీసి కొట్టారు. బిలాస్ పూర్ జిల్లాలోని సిపట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సిపట్ పట్టణంలో మహావీర్ అనే సెక్యూరిటీ గార్డు ఇటీవల మనీష్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేయటానికి వెళ్లగా…. ఇంట్లో వాళ్లంతా కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసు స్టేషన్ లో చెప్పి అతడిని  పోలీసులకు అప్పగించారు.

ఇరువర్గాలతో  పోలీసు స్టేషన్‌లో  ఎస్సై మాట్లాడగా…తాము ఈ వ్యవహారం సెటిల్ చేసుకుంటామని మనీష్ చెప్పటంతో మహావీర్‌ను పోలీసులు విడిచిపెట్టారు. కాగా… గురువారం మధ్యాహ్నం సమయంలో మనీష్ మరి కొంత మందితో కలిసి మహావీర్‌ను చెట్టుకు తలకిందులుగా వేలాడ దీసి కొటట్టం ప్రారంభించారు. విడిచిపెట్టమని ఎంత బతిమలాడినా కనికరించలేదు.
Also Read : Andhra Pradesh : అనకాపల్లిలో పట్టపగలే బ్యాంకు దోపిడీ..తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలు చోరీ

ఇంతలో ఒక మహిళ వెళ్లి పోలీసు స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేయటంతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మహావీర్‍‌ను రక్షించారు. మరోసారి తమ ఇంట్లో దొంగతనం చేయటానికి ప్రయత్నించటంతో  కొట్టామని మనీష్ చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.