భార్యతో మాట్లాడుతున్నాడని వ్యక్తిపై కత్తితో దాడి

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.

  • Edited By: veegamteam , November 28, 2019 / 09:43 AM IST
భార్యతో మాట్లాడుతున్నాడని వ్యక్తిపై కత్తితో దాడి

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

తమ్మ రాములు, రవీందర్ సింగరేణి కార్మికులు. గోదావరిఖని గంగానగర్ మిలీనియం క్వార్టర్స్ లో పక్కపక్కనే నివాసముంటున్నారు. తన భార్యతో రవీందర్ అనే యువకుడు తరచూ ఫోన్ లో మాట్లాడుతున్నాడనే అనుమానంతో రాములు కత్తితో రవీందర్ పై దాడి చేశాడు.

దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రవీందర్ ను చికిత్స కోసం సింగరేణి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.