వాడే చంపాడు : వారాసిగూడ ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు

ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 02:14 PM IST
వాడే చంపాడు : వారాసిగూడ ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో సంచలన నిజాలు

ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా

ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. మరి పోలీసులు అతడే హంతకుడని ఎలా తేల్చారు..? కేసు మిస్టరీని ఛేదించే దర్యాప్తులో జాగిలాలు ఎలా ఉపయోగపడ్డాయి..? మొత్తంగా ఎన్ని కోణాల్లో..ఏ విధంగా దర్యాప్తు చేపట్టారు..? ఆ యవకుడు అమ్మాయిని ఎలా చంపాడు..?

హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థిని మర్డర్‌ పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాలుగైదు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు…షోయబ్‌ హంతకుడని తేల్చారు. వారాసిగూడ విద్యార్థిని నజ్మా..జనవరి 24న తెల్లవారుజామున ఇంటిపక్కనే రక్తపు మడుగులో కనిపించింది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అమ్మాయి భవనం పైనుంచి పడి మృతి చెందినట్లు తొలుత భావించినా…శరీరంపై దాడి చేసినట్లు గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు భవనాల మధ్యలో మృతదేహం పడి ఉండటంతో ఏ భవనం నుంచి పడిందో తెలుసుకునేందుకు పైకి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు ప్రాథమికంగా హత్యగా నిర్ధారించారు. ఇక తమ కూతురి మరణానికి షోయబ్‌ అనే యువకుడే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. నజ్మాను పెళ్లి చేసుకుంటానంటూ కొంత కాలంగా వేధించేవాడని తెలిపారు. అప్పటికే పోలీసులు బృందాలు ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. ఆ దర్యాప్తులో కూడా షోయబ్‌ పేరు వెలుగులోకి రావడంతో…ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

గురువారం అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు షోయబ్…నజ్మా ఇంటి పైకి చేరుకున్నాడు. అక్కడ చదువుకుంటున్న ఆమెతో గొడవ పడ్డాడు. తననే పెళ్లి చేసుకోవాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని, చాటింగ్ చేయకూడదని బెదిరించాడు. ఆమె ఎదురు తిరగడంతో అక్కడే ఉన్న పదునైన రాయితో మొదట పీక కోశాడు. ఆ తర్వాత గ్రానైట్ రాయితో తలపై కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని 20 అడుగుల వరకు ఈడ్చుకుంటూ వచ్చి…రెండు భవనాల మధ్య కిందకి తోసేశాడు. అక్కడి నుంచి కిందికి వచ్చి చనిపోయిందని నిర్ధారణకు వచ్చాకే షోయబ్ ఇంటికి వెళ్లిపోయాడు.

నజ్మా చనిపోయిందా..? లేదా..? అని నిర్ధారించుకునేందుకు వేకువజామున 3.15 నిమిషాలకు మరోసారి స్పాట్‌కు వచ్చినట్లు సీసీ ఫుటేజ్ లో ఉంది. ఆ ఫుటేజీలో షోయబ్ ఒక్కడే ప్రవేశించడం, సైడ్ వాల్ దూకి వెళ్లడం, హతమార్చిన తర్వాత పరిగెడుతూ వెళ్లడం వంటి దృశ్యాలు లభ్యమయ్యాయి. ఆ సీసీ ఫుటేజీల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చారు పోలీసులు.

మరోవైపు షోయబ్ ఫేస్‌బుక్‌ పేజీని ఓపెన్ చేసి…సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోలతో సరిపోల్చుకుని అతడే నిందితుడని నిర్ధారించుకున్నారు. విచారణలో సైతం సోయబ్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. తానే ఆ హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇక ఘటన అనంతరం రంగంలోకి దిగిన పోలీస్‌ జాగిలం అనేక ఆధారాలు పోలీసులకు సేకరించి ఇచ్చింది. దాదాపు 40 నిమిషాల పాటు జాగిలం మర్డర్‌ స్పాట్‌ను వీడలేదు. చుట్టూ 300 మీటర్ల వరకు జాగిలం పరిగెడుతూ ఓ చోట ఆగింది. 

ఆ తర్వాత షోయబ్ వెళ్లిన గల్లి వైపు వెళ్లింది. జాగిలం చూపించిన ఆధారాలు…సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా షోయబ్‌ మొబైల్‌ను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. షోయబ్ ఫోన్‌ నుంచి మృతురాలికి లాస్ట్‌ మెసేజ్‌.. లాస్ట్‌ కాల్‌ వెళ్లినట్లు గుర్తించారు. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేవలం 5 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఆధారాలతో హంతకుడిగా నిర్ధారించుకుని.. ఇంట్లో మంచం కింద దాక్కున్న షోయబ్‌ను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.