Rajasthan : ఆర్టీఐ కార్యకర్త కాళ్లలో మేకులు దింపారు

ఓ వ్యక్తి కాళ్లలో మేకులు కొట్టి తీవ్రంగా హింసించారు. అతను చనిపోయాడని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ వ్యక్తిని....

Rajasthan : ఆర్టీఐ కార్యకర్త కాళ్లలో మేకులు దింపారు

Crime

Rajasthan RTI Activist : పలు రాష్ట్రాల్లో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు కొందరు. తమకు శిక్ష పడుతుందని తెలిసినా…డోంట్ కేర్ అంటున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి కొన్ని ఘటనలు. తాజాగా..ఓ వ్యక్తి కాళ్లలో మేకులు కొట్టి తీవ్రంగా హింసించారు. అతను చనిపోయాడని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.

Read More : Shocking : డబ్బుల కోసం..8 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న యువకుడు

అమరా రామ్ గోదారా బాడ్ మేడ్ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ఇతను సమాచార హక్కు చట్టం (RT(I) కార్యకర్త. గుర్తు తెలియని వ్యక్తులు గోదారాను అపహరించారు. ఓ ప్రాంతంలో దారుణంగా కొట్టారు. అనంతరం రెండు కాళ్లలో మేకులు దింపారు. తీవ్రమైన బాధతో అల్లాడుతున్నా..వాళ్లు కనికరించలేదు. చివరకు సృహతప్పడంతో చనిపోయాడని భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామానికి సమీపంలో రోడ్డు పక్కన తీవ్రగాయాలతో ఉన్న ఆయన్ని గ్రామస్తులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

Read More : India : ఒమిక్రాన్ టెన్షన్..భారతదేశంలో మళ్లీ ఆంక్షలు..ఏ రాష్ట్రంలో ఎలా

మద్యం మాఫియాపై తాను కంప్లైట్ చేసినందుకే మాజీ సర్పంచ్ ఈ దాడి చేయించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ దాడిని రాష్ట్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకొనేందుకు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసులు. తాను ఆసుపత్రికి వెళ్లి గోద్రాను పరామర్శించినట్టు ఎస్పీ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు..వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.