Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లాలో  రెండు ఇన్నోవాలలో అక్రమంగా  తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Red Sandalwood : రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Red Sandalwood : చిత్తూరు జిల్లాలో  రెండు ఇన్నోవాలలో అక్రమంగా  తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారు ఝూమున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు ఇన్నోవాలలో తరలిస్తున్న ఎ్రరచందనం దుంగలను గుర్తించారు. వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read : AP CID Search : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు-చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పని చేసిన లక్ష్మీ నారాయణ

ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు  వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లుకు చెందిన మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు సమాచారం.