Rehnuma Bhati : టీమిండియా క్రికెటర్ పై అత్యాచార ఆరోపణలు

క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వీరాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి..

Rehnuma Bhati : టీమిండియా క్రికెటర్ పై అత్యాచార ఆరోపణలు

Rehnuma Bhati

Rehnuma Bhati : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య రెహనుమా సంచలన ఆరోపణలు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వీరాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరందరూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంది. కాగా, రెహనుమా తన పరిస్థితికి భర్త రియాజ్ భాటీనే కారణమని వెల్లడించింది.

iPhone Users: హ్యాకర్లతో ఐఫోన్ యూజర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది-గూగుల్

వ్యాపార ప్రయోజనాల కోసం భర్తే ఇతరులతో శారీరక సంబంధాలకు బలవంతం చేసేవాడని వివరించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల దగ్గరికి పంపించాడని ఆరోపించింది. అయితే, రెహనుమా ఫిర్యాదు పత్రంలో సరైన చిరునామా తెలపలేదు. ఏ రోజు, ఏ చోటులో తనపై లైంగిక దాడి జరిగింది చెప్పలేదు. దీంతో ఆమె చేసిన ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక పాండ్యా, మునాఫ్ లను ఆమె క్రికెటర్లుగా గుర్తించింది. రాజీవ్ శుక్లాను బీసీసీఐ మాజీ చైర్మన్ గా తెలిపింది.

”పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసేలా ప్రయత్నం చేస్తున్నా. కానీ వాళ్లు రిజిస్ట్రర్ చేయడం లేదు. సెప్టెంబర్ లో నేను అప్లికేషన్ ఇచ్చాను. ఇప్పుడు నవంబర్ వచ్చేసింది. ఈ కేసుకి సంబంధించి అనేక సార్లు పలువురు పోలీసు అధికారులతో ఫాలోప్ చేశాను. కేసు బుక్ అవ్వాలంటే డబ్బు ఇవ్వాలని కొందరు అడిగారు. నేను అవినీతిని ప్రోత్సహించను. నేను రైట్ ప్లేస్ లోనే ఉన్నాను. అసలైన నేరస్తులు వాళ్లు” అని రెహనుమా అన్నారు.

Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?

దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింఘే స్పందించారు. రెహనుమా భాటీ అప్లికేషన్ ఇవ్వడం నిజమే అన్నారు. అయితే ఆ సమయంలో ఆమె దగ్గర పూర్తి వివరాలు లేవన్నారు.

కాగా, రియాజ్ భార్య సెప్టెంబర్ 24, 2021 శాంతాక్రజ్ ముంబై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ తాలుకు కాపీని సోషల్ మీడియా యూజర్ సమీత్ ఠక్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.