TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ

TSPSC paper (3)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో టీఎస్పీఎస్సీ కంప్యూటర్ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి విడుదలైన ప్రతీ పేపర్ లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు గ్రూప్-1, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీడీపీఓ, సూపర్ వైజర్ గ్రేడ్-2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ… ఏడు పరీక్షలను నిర్వహించింది.

నిగ్గు తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. అక్టోబర్ నుంచి పూర్తైన అన్ని పరీక్షల్లో టాప్ మార్క్స్ తెచ్చుకున్న ప్రతీ ఒక్కరినీ విచారించాలని సిట్ భావిస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు. విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడంపై అప్పట్లోనే వారి స్వగ్రామం జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

TSPSC Paper Leak : AE పేపర్ ఒక్కటేనా? ఇంకా లీక్ అయ్యాయా? TSPSC పేపర్ లీక్‌లో విచారణ వేగవంతం

పరీక్ష రాసిన రాజశేఖర్ బంధువులు ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయ్యారు. అయితే రాజశేఖర్ ముందే పేపర్ లీక్ చేసి బంధువులకు ఇచ్చాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో శనివారం (మార్చి18) చంచల్ గూడ్ జైలు నుంచి 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఏ1 ప్రవీణ్ కుమార్ తో పాటు, ఏ2గా ఉన్న అట్ల రాజశేఖర్, ఏ3గా రేణుకా రాథోడ్, ఏ4గా ఉన్న డాక్యా, ఏ5గా ఉన్న కేతావత్ రాజేశ్వర్, ఏ6గా ఉన్న కేతావత్ నీలేశ్ నాయక్, ఏ7గా ఉన్న గోపాల్ నాయక్, ఏ8గా ఉన్న కేతావత్ శ్రీనివాస్, ఏ9గా ఉన్నటువంటి కేతావత్ రాజు నాయక్ ను చంచల్ గూడ జైలు నుంచి సిట్ అధికారులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. కింగ్ కోటి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అక్కడే ఆరు రోజులపాటు పూర్తిగా విచారించి వారి స్టేట్ మెంట్ ను నమోదు చేసుకోనున్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు

ప్రధానంగా ఈ కేసులో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారని ఇప్పటికే సిట్ కొన్ని ఆధారాలు సేకరించారు. అతని ద్వారా పేపర్ లీక్ అయినట్లు సిట్ అధికారులు అన్నీ ఎవిడెన్స్ సేకరించారు. గతంలో కూడా రాజశేఖర్ అనేక పేపర్లను లీక్ చేసినట్లు ఆధారాలున్నాయి. విదేశాల్లో ఉన్న తన బంధువులను సైతం తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్-1 ఎగ్జామ్ రాయించినట్లు కొన్ని ఆధారాలను అధికారులు సేకరించారు. నిందితుల విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.